Akash Puri New Movie Preponed : ప్రీపోన్ అయినా ఆకాష్ పూరి రొమాంటిక్ :-

Akash Puri New Movie Preponed : ఆకాష్ పూరి గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరమే లేదు. డాషింగ్ డైరెక్టర్ పూరి గారి అబ్బాయే అయినా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తూనే మెహబూబా వంటి పక్క కమర్షియల్ అండ్ లవ్ రిలేటెడ్ సినిమా తీసి హీరోగా మంచి మార్కులు దక్కించుకున్నారు.
మెహబూబా సినిమా లో అతని నటనకి చాల మంది ఆశ్చర్యపోయారు కూడా. అలాంటి ఆకాష్ హీరోగా చేసిన తదుపరి సినిమా రొమాంటిక్. ఈ సినిమా షూటింగ్ ఎపుడూ పూర్తి చేసుకుంది. కాకపోతే కరోనా వాళ్ళ , ఆంధ్ర ప్రదేశ్ లోని టికెట్ రేట్స్ ఇష్యూ వాళ్ళ ఇలా అనేక కారణాల చెత సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకుండా సైలెంట్ గా ఉండిపోయారు చిత్రబృందం.
అయితే ఇన్నాళ్ళకి దసరా కానుకగా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా నవంబర్ 4 న విడుదలకు సిద్ధం చేశారని చిత్రబృందం ప్రకటించింది. విడుదల తేదీ ప్రకటించి వారం రోజులు కూడా కనకుండా మరల విడుదల తేదీని మార్చేశాము అని చిత్రబృందం అధికారిక ప్రకటించారు.
అయితే రొమాంటిక్ సినిమా ముందుగా అనుకున్నట్లు నవంబర్ 4 న విడుదల చేయకుండా ప్రీపోన్ చేసి అక్టోబర్ 29 న విడుదల చేస్తున్నాం అని ఇటీవలే మరల కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఏదేమైనా సినిమా అనుకున్న తేదికంటే ముందే వస్తుందని పూరి గారి అభిమానులు ఆనందిస్తున్నారు. చూడాలి మరి ఆకాష్ పూరి రెండవ సినిమా రొమాంటిక్ ఏ రేంజ్ లో ప్రేక్షకులని అలరిస్తుందో.