Akhanda Releasing and Maha samudram Postpone : అఖండ రాకతో రిలీజ్ అవ్వాల్సిన సినిమా పోస్ట్ పోన్ :-

Akhanda Releasing and Maha samudram Postpone : ఇన్నిరోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు అన్ని వరుసబెట్టి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తూ వస్తున్నాయి. అందులో పుష్ప , మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇలా దాదాపు 15 సినిమాలు పైగా విడుదల తేదీని ఖరారు చేసి కూర్చున్నారు. కానీ ఒక బాలయ్య బోయపాటి అఖండ మాత్రం అనౌన్స్ చేయకుండా ఉండడం తో దసరా కి రాకపోవచ్చు అని ఆలోచించి మిగిలిన సినిమాలు దసరాకి రిలీజ్ పెట్టుకున్నారు. అందులో శర్వానంద్ సిద్ధార్థ్ ల మల్టీ స్టార్రర్ మహా సముద్రం ఒకటి.
ఈ సినిమా అక్టోబర్ 14 న విడుదల తేదిని ఖరారు చేసి ప్రొమోషన్స్ చేసే పనిలో బిజీ గా ఉండగా, ఊహించని దిశల్లో షాక్ ఇచ్చారు అఖండ బృందం.
ఇటీవలే బాలయ్య అఖండ విడుదల తేదీని ప్రకటించారు. అయితే అఖండ దసరా కి అక్టోబర్ 13 న రాబోతుందని అధికారికంగా ప్రకటించారు. దీనితో బాలయ్య సినిమాతో పోటీ వదు అనుకొని మహా సముద్రం చిత్ర బృందం సినిమాని పోస్ట్ పోన్ చేయాలనీ ఫిక్స్ అయ్యారు.
కాబట్టి బాలయ్య రాకతో శర్వానంద్ సిద్దు లా మాస్ ఎంటర్టైనర్ పోస్ట్ పోన్ అని అర్ధం అవుతుంది. అజయ్ భూపతి ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు. మొట్టమొదటి సారి సిద్ధార్థ్ విలన్ షేడ్స్ తో కనిపిస్తున్నారు.
కానీ బాలయ్య రాకతో విడుదల పోస్ట్ పోన్ అవబోతుంది.
కాబట్టి దసరా రేస్ నుంచి మహా సముద్రం తప్పుకుందనే చెప్పాలి. మొత్తానికి ఈ దసరా కి అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ , వైష్ణవ్ తేజ్ కొండా పొలం , బాలయ్య అఖండ విడుదలయి అలరించబోతున్నాయి. మహా సముద్రం కొత్త విడుదల తేది కోసం ఎదురు చూస్తుంది. త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటించబోతుంది.