Akhil ‘s Most Eligible Bachelor Once again Postponed : పోస్టుపోన్ అయినా అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ :-

Akhil ‘s Most Eligible Bachelor Once again Postponed : అక్కినేని అఖిల్ వరుసగా సినిమాలు అనౌన్స్ చేసి బిజీ గా ఉన్నపటికీ సరైన సక్సెస్ లేక బాధ పడుతున్నారు. కష్టపడి తీస్తున్న ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ అవుతుంది. ఇపుడు అఖిల్ ఆశలని బొమ్మరిల్లు భాస్కర్ తో తీస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పైననే ఉన్నాయి.
అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పైన ఈరోజు క్లారిటీ ఇచ్చింది చిత్ర బృందం. మ్యాటర్ లోకి వెళ్తే గతం లో ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. కాకపోతే దాని నిరాకరించి చిత్ర బృందం థియేటర్లోనే ఈ సినిమా విడుదల అవుతుంది అని అధికారికంగా అక్టోబర్ 8 న థియేటర్ లో విడుదలకు సిద్ధం చేస్తాం అని పోస్టర్ రూపం లో తెలియచేసారు.
ఇదిలా ఉండగా రిలీజ్ టైం దగ్గరపడుతుంది , చిత్ర బృందం నుంచి ఎటువంటి హుంగామ కానీ, ప్రొమోషన్స్ చేస్తున్నట్లు కానీ కనిపించకపోవడం తో అభిమానుల్లో అనుమానాలు రేగాయి. చివరికి వారి అనుమానమే నిజమైంది. మొత్తానికి మరల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పోస్టుపోన్ అయింది.
ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ 8 న కాకుండా దసరా కానుకగా అక్టోబర్ 15 న విడుదల చేస్తున్నాం అని చిత్ర బృందం ఈరోజు అధికారికంగా ప్రకటించింది.
అయితే అక్టోబర్ 14 న శర్వానంద్ , సిద్ధార్థ్ ల మహా సముద్రం సినిమా రాగ ఒక రోజు తర్వాత అఖిల్ సినిమా రావడంతో థియేటర్లు యాజమాన్యం మరియు డిస్ట్రిబ్యూటర్ లు ఆందోళనకు గురవుతున్నారు.
వీటన్నిటి మధ్య ఇంకా బాలయ్య బాబు అఖండ విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. చూడాలి మరి ఈసారి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మరల పోస్టుపోన్ చేస్తారో లేదా అక్టోబర్ 15 నే విడుదల చేస్తారో. ఏదేమైనా ఈ సినిమాతోనైనా అఖిల్ హిట్ ట్రాక్ లో రావాలని కోరుకుందాం.