Allu arjun Gets Emotional: కంటతడి పెట్టిన అల్లు అర్జున్
Allu arjun: కంటతడి పెట్టిన అల్లు అర్జున్ : సామ్ జమ్ షో తో ప్రముఖ సెలబ్రెటీలను తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న సమంత… అక్కినేని కోడలు అయిన తర్వాత వెండితెరకు కాస్త గ్యాప్ ఇచ్చింది… కానీ సమంత ప్రేక్షకులను బుల్లితెరలో పలు షోలకు హోస్ట్ వ్యవహరిస్తూ ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను ఆకర్షించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆహా ఓటీటీ లో “సామ్ జమ్” షో ద్వారా మెగాస్టార్ చిరంజీవి ,రకుల్ ప్రీత్ సింగ్, విజయ్ దేవరకొండ , డైరెక్టర్ క్రిష్ మొదలైన ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేసింది.

తాజాగా సామ్ జామ్ షోలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అల్లు అరవింద్ ను ఇంటర్వ్యూ చేసింది. ఈ మేరకు ఎపిసోడ్ ప్రోమో ను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో అల వైకుంఠపురం సినిమా ఫంక్షన్ లో అల్లు అర్జున్ “కొడుకు పుట్టిన తర్వాత నాకు ఒక విషయం అర్థమయ్యింది. నేను మా నాన్న అంత గొప్పవాడిని కాదు. ఆయనలో సగం కూడా నేను ఎప్పుడూ అవ్వ లేను అంటూ భావోద్వేగానికి గురైన సన్నివేశాలను “సామ్ జమ్ “షోలో ప్రసారం చేశారు. దీంతో ఈ వీడియో చూస్తున్నా అల్లు అర్జున్ తో పాటు సమంత కూడా ఎమోషనల్ గా ఫీల్ అయింది..