Tollywood news in telugu
నేనే స్వయంగా నా పెళ్లి గురించి ప్రకటిస్తా… పుకార్లు నమ్మకండి !

ఈ మధ్యనే శిరీష్ పెళ్లి గురించి సాయిధరమ్ తేజ్ మాట్లాడిన విషయం తెలిసిందే. అల్లు శిరీష్ నాకంటే వయసులో పెద్దవాడు వచ్చే సంవత్సరంలో తన పెళ్లి జరగవచ్చు అని సాయి ధరమ్ అనడంతో, ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
శిరీష్ తన పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై రీసెంట్ గా స్పందించారు. సాయిధరమ్ తేజ్ కేవలం జోక్ గా అన్నాడు. నేనే స్వయంగా నా పెళ్లి గురించి ప్రకటిస్తా అని చెప్పారు. ఇంకా నేను చేయాల్సిన పనులు చాల ఉన్నాయ్ వాటి తరవాతే నా పెళ్లి ఉంటుంది. ప్రస్తుతానికి సింగిల్‌గా ఉన్నందుకు సంతోషంగానే ఉంది అని శిరీష్ తెలిపాడు.