Tollywood news in telugu

Alluarjun Sukumar Aarya 3 fix : ఆర్య 3 కి సర్వం సిద్ధం :-

Alluarjun Sukumar Aarya 3 fix

Alluarjun Sukumar Aarya 3 fix : అవును మీరు చదివింది నిజమే. అల్లుఅర్జున్ కెరీర్ లో మైల్ స్టోన్ సినిమాగా చిరకాలం నిలిచిపోయే సినిమా ఆర్య. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి రికార్డులు సృష్టించిందో కొత్తగా చెప్పడానికి ఎం లేదు. ఆర్య సినిమాలోని పాటలు ఇప్పటికి వింటుంటారు అంటే అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమా ఏంటనేది.

అలాంటి బ్లాక్ బస్టర్ సినిమా కి సంబందించిన పార్ట్ 2 కూడా వచ్చింది. ఆర్య 2 థియేటర్ లో విడుదలైనప్పుడు పెద్దగా ఆడకపోయినా , టీవీ లో టెలికాస్ట్ అయినపుడు అందరికి నచ్చేసి క్లాసిక్ కేటగిరీ లో వేసేశారు.

ఆర్య 2 లో అల్లుఅర్జున్ వేసిన స్టెప్స్ చూసి ఫిదా అయి ప్రయత్నించి గాయపడిన వారు ఎందరో. అల్లుఅర్జున్ డాన్స్ కోసమే సినిమా చుసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రెండు సినిమాలు విడుదలయ్యి దాదాపు 12 ఏళ్ళు దాటినా ఆర్య అనే పదానికి క్రేజ్ మాత్రం తగ్గలేదు.

మ్యాటర్ లోకి వెళ్తే ఈరోజు ఇంస్టాగ్రామ్ లో దర్శకుడు సుకుమార్ లైవ్ లో కి వచ్చారు. సుకుమార్ అభిమానులు అందరు ఆర్య 3 గురించి ప్రశ్నలు అడగగా సుకుమార్ గారు ‘ ఆర్య 3 స్క్రిప్ట్ దాదాపు పూర్తయింది. త్వరలో ఆర్య 3 తీయబోతున్నాము అని అధికారికంగా ప్రకటించేశారు ‘.

అయితే సుకుమార్ ప్రస్తుతం బన్నీ తోనే కలిసి ప్యాన్ ఇండియా లెవెల్ లో పుష్ప సినిమా రెండు భాగాలుగా తియ్యబోతున్నరని తెలిసిందే. ఈ సినిమాలోని మొదటి భాగం అయినా పుష్ప ది రైజ్ డిసెంబర్ 17 న విడుదలకు సిద్ధం అయింది.

ఎలాగో బన్నీ తోనే పుష్ప తీస్తున్నారు కాబ్బటి , ఆర్య 3 కి సంబంధించిన స్టోరీ డిస్కషన్ జరిగి ఉంటుంది. దానికరణంగానే ఆర్య 3 కి సంబంధించి అధికారికంగా లైవ్ లో సుకుమార్ చెప్పగలిగారు అని అర్ధం అవుతుంది.

అయితే బన్నీ పుష్ప పార్ట్ 1 మరియు పార్ట్ 2 తర్వాత ఐకాన్ సినిమా పూర్తయ్యాక ఆర్య 3 షూట్ మొదలవబోతుందని తెలిసింది. ఈ ఆర్య 3 కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తారు. చూడాలి మరి ఆర్య 3 కంటే ముందు సుకుమార్ మరియు బన్నీ కలిసి పుష్ప ని ప్యాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుందాం.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button