Alludu Adhurs Movie Review: అల్లుడు అదుర్స్ సినిమా హిట్టా ? ఫట్టా ?

Alludu Adhurs Movie Review: అల్లుడు శీను సినిమాతో తెలుగు చిత్ర సీమకి పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్… రాక్షసుడు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అదే తరహాలో అల్లుడు అదుర్స్ అనే చిత్రంతో హిట్ కొట్టాలని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈరోజు రిలీజ్ అయిన అల్లుడు అదుర్స్ సినిమా హిట్టా ఫట్టా అనేది తెలుసుకుందాం..

సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అల్లుడు అదుర్స్ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ శీను అనే పాత్రలో నటించారు. అదే విధంగా ఈచిత్రంలో హీరోయిన్లుగా అను ఇమ్మాన్యుయేల్ “వసుంధర” అనే పాత్రలో & నభా నటేష్ “కౌముది” పాత్రలో నటించారు. అదేవిధంగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇద్దరమ్మాయిల తండ్రి అయినా “నిజామాబాద్ జైపాల్ రెడ్డి” పాత్రలో, నటుడు సోను సూద్ ” గజ్జ” అనే రౌడీ పాత్రలో నటించారు.

ఈ చిత్రంలో శీను వసుంధర అనే అమ్మాయిని ప్రేమిస్తాడు.. అలాగే ఆ అమ్మాయి గజను ప్రేమిస్తుంది.. తీరా కట్ చేస్తే శ్రీను వసుంధర చెల్లెలైన కౌముది ప్రేమలో ఉంటారు. వీరిద్దరి తండ్రియన “నిజామాబాద్ జైపాల్ రెడ్డి” అల్లుడితో ఎలా ఇబ్బందులు పడ్డాడో.. లాస్ట్ కి శీను ఎవరిని పెళ్లి చేసుకుంటాడో అనేదే సినిమా అసలైన కథ…

ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మద్య జరిగే సన్నివేశాలు ఫుల్ కామెడీ ఎంటర్ టైన్ మెంట్ ని తెచ్చాయని అని చెప్పవచ్చు. డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ కందిరీగ అనే చిత్రన్ని ఎలా తెరకెక్కించాడో.. అదే కాన్సెప్ట్ ని ..ఈ సినిమాలో ఫాలో అయ్యాడు.
ఈ చిత్రంలో కమెడియన్స్ శ్రీనివాస్ రెడ్డి, సత్య, చమ్మక్ చంద్ర బాగా కామెడీ పండించారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మంచి సంగీతాన్ని అందించాడు. అలాగే హీరోయిన్ , బిగ్ బాస్ ఫేమ్ మోనాల్ గజ్జర్ చేసిన ఐటమ్ సాంగ్ అద్భుతంగా ఉంది. ఓవరాల్ గా చూస్తే సినిమా పర్లేదు బానే ఉంది… కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా ఇది..