Alludu Garu Web Series Movie Review | అల్లుడు గారు

Movie :- Alludu Garu (2021) Aaha Series Review (అల్లుడు గారు రివ్యూ)
నటీనటులు :- అభిజిత్ పోండ్ల , ధన్య బాలకృష్ణ , శాలిని , కాశి విశ్వనాథ్ , సుధ
నిర్మాతలు :- తమడ మీడియా , డైస్ మీడియా , ఆహా ఒరిజినల్స్
డైరెక్టర్ :- జయంత్ గాలి
Release Date: 29th October 2021 On Aaha OTT Platform
EPISODE 1 : రండి దయ చేయండి :-
అల్లుడు గారు మొదటి ఎపిసోడ్ లో అల్లుడు గా అజయ్ ( అభిజిత్ ) ఇంట్రడక్షన్. అజయ్ భార్య అమ్ము ( ధన్య బాలకృష్ణ) .అజయ్ పని మీద ఒక నెల హైదరాబాద్ రాగా అతి కష్టం మీద ఇబ్బందిగా ఫీల్ అవుతూనే మామయ్య (కాశి విశ్వనాథ్) గారి ఇంటికి వెళ్తడు. వెళ్ళిన ఒక రోజులోనే వారు చూపించే అతి ప్రేమను తట్టుకోలేకపోతున్నాడు. కానీ భరిస్తున్నాడు. కాశి విశ్వనాధ్ గారి రిటైర్మెంట్ డబ్బులతో కొన్న కార్ నీ ఆఫీస్ పనిమీద తీసుకొని వేళ్ళు అని చెప్పగా , అజయ్ కార్ తీసుకొని వెళ్తాడు.
అంత బాగా జరుగుతుంది అని అనుకునే సమయానికి అజయ్ డ్రైవింగ్ చేసే సమయం లో అనుకొని సంఘటన ఎదురయ్యి కేర్ హెడ్ లైట్స్ మరియు ముందర అంతా పగిలిపోయి పూర్తిగా డ్యామేజ్ అయ్యింటది. ఇప్పుడు అజయ్ మరియు సౌమ్య ( అజయ్ భార్య అయిన ధన్య బాలకృష్ణ చెల్లెలు ) సహాయం తీసుకొని కార్ ముందర నిలబడటం తో ఎపిసోడ్ పూర్తవుతుంది. సెకండ్ ఎపిసోడ్ నవంబర్ 5 న రాబోతుంది.
Episode 1 Overview :- మొత్తానికి అల్లుడుగారు మొదటి ఎపిసోడ్ కామెడీ గాను మరియు సెకండ్ ఎపిసోడ్ పై ఆశక్తి రేగేలా చేసిందని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు.అల్లుడుగా అభిజీత్ బాగా చేశారు.అతి ప్రేమను చూపించే అత్త మావయ్య లా కాశి విశ్వనాధ్ మరియు సుధా కామెడీ ని బాగా పండించారు.
ఒక చిన్న ట్విస్ట్ తో ఎపిసోడ్ 1 బాగా ఎండ్ చేశారు. చూడాలి మరి ఎపిసోడ్ 1 లాగే మిగితా ఎపిసోడ్స్ కూడా అందరి అంచనాలను రీచ్ అవుతుందో లేదో. ఎపిసోడ్ 1 మాత్రం పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే తో అందరిని ఆకట్టుకున్నారు.