అమరం అఖిలం ప్రేమ రివ్యూ !

amaram akhilam prema Review :: సినిమా :- అమరం అఖిలం ప్రేమ (2020)
నటీనటులు :- శ్రీకాంత్ అయేంగర్ , శివశక్తి , కేశవ్ దీపక్
మ్యూజిక్ డైరెక్టర్:- రధాన్
నిర్మాతలు :- ప్రసాద్
డైరెక్టర్ :- జోనాథన్ వేసపోగు
కథ:-
ఈ కథ అఖిల అనే అమ్మాయి చిన్ననాటితనం నుంచి మొదలవుతుంది. అఖిల మరియు తన తండ్రి కి ఒకరంటే ఒకరికి పంచప్రాణాలు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. అలంటి దృఢమైన బంధం తండ్రీ కూతురులది. అనుకోకుండా అఖిల చేసిన ఒక పని వాలా తండ్రి కూతురుల మధ్య గొడవలు మొదలవుతాయి. ఇదే సమయం లో అఖిల ఐ ఏ యస్ కోచింగ్ కోసం హైదరాబాద్ కు వెళ్తుంది. అక్కడ అమర్ అనే అబ్బాయి అఖిల వెంటపడుతుంటాడు. మొదట్లో అఖిల చిరాకు పడ్డ ఆఖరికి అమర్ ప్రేమని ఒప్పుకుంటుంది. ఇలా హ్యాపీ గా సాగుతున్న ఈ కథ లో అసలు అఖిల మరియు తన తండ్రి ఎందుకు గొడవ పడ్డారు? వారిద్దరి మధ్య దూరం పెరగడానికి గల కారణాలు ఏమిటి ? చివరికి అఖిల తన ప్రేమని ఎలా గెల్చుకుంది? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా ఆహ లో చూడాల్సిందే.
* తండ్రిగా శ్రీకాంత్ అయేంగర్ తన నటనతో ప్రేక్షకులని కట్టిపడేస్తాడు. కూతురిగా శివశక్తి ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. హీరో గా విజయ్ రామ్ కొని చోట్ల చక్కగా నటించారు.
Plus Points
* సినిమాకి సంబంధించిన ప్రతి ఒక క్యారెక్టర్ ని చాలా క్లుప్తంగా వివరించారు.
* డైరెక్టర్ కథ మరియు కథనం చక్కగా వ్రాసుకున్నారు.
* బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొత్తగా ఉంది.
*సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.
* ప్రొడక్షన్ విలువలు కూడా చాలా బాగున్నాయి.
Minus Points
* మొదటి భాగం లో ఎడిటింగ్ కూడా బాగోలేదు.
* ఇంటర్వెల్ కి 15 నిమిషాల ముందు వరకు సినిమా బోర్ కొట్టిస్తుంది.
ముగింపు :-
మొత్తానికి అమరం అఖిలం ప్రేమ చిత్రం తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. తండ్రి కూతురులా బంధాన్ని చాల అద్భుతంగా చిత్రీకరించారు. సినిమాకి ప్రాణమే వారిద్దరి బంధం. హీరో గా విజయ్ రామ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కానీ సినిమాలో కథ కి విలువ ఇచ్చారు కాబ్బటి సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. డైరెక్టర్ మొదటి భాగం మీద కూడా ద్రుష్టి పెటింటే సినిమా ఇంకా బాగుండేది. కెమెరా పని తీరు బాగుంది. నిర్మాణ విలువలు క్లుప్తంగా కనిపిస్తున్నాయి. మ్యూజిక్ చక్కగా ఉంది. మొత్తానికి ఈ వారం కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని ఒకసారి చూసేయచ్చు.
రేటింగ్ :- 2.75 /5