చైనాలో అందుబాటులోకి వచ్చిన అద్భుత కట్టడం.. చూస్తే మీకు అక్కడికి వెళ్లాలనిపిస్తుంది… వైరల్ గా మారిన ఫొటోస్…!

అద్భుతాలు చేస్తూ ప్రపంచదేశాలను తన వైపు చేసుకొనేలా చేసే దేశం చైనా , ఈ దేశం వారు ఏ పని చేసిన ప్రపంచమంతటా అదొక హాట్ టాపిక్ అయిపోతుంది. ఇపుడు ఇలాంటిదే ఒక టాపిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చైనా దేశం లో చాలావరకు ఎన్నో అద్భుత కట్టడాలు ఉన్నాయి. తాజాగా చైనా లో మరో అద్భుతకట్టడం ప్రపంచదేశాలను తనవైపు చూపును తిప్పుకుంటుంది. చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో నిర్మించిన ‘రూయి’ అనే వంతెన ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
మరి ఇంత ఆశ్చర్యానికి గురిచేసే అద్భుతం ఏముందనుకుంటున్నారా.. ఆ వంతెన ఒక డిఫరెంట్ ఆకారం లో ఉండటం. భూమి ఉపరితలానికి 140 మీటర్ల హైట్ లో ఈ గాజు వెంతెనను డీఎన్ఏ కణం ఆకారంలో నిర్మాణం చేపట్టారు. ఇక ఈ వంతెనకు అక్కడి ప్రజలు ‘బెండింగ్’ బ్రిడ్జ్ అని పేరుకూడా పెట్టేశారు. వంతెన ఎలావుందంటే, వంతెన రెండు భాగాలు ఒకదానితో ఒకటి కలుసుకుని, విడిపోయి, మెలికలు తిరిగినట్లుగా ఉంటుంది. ఈ వంతెన నిర్మాణాన్ని 2017 లో మొదలు పెట్టారు. దీని యొక్క పొడవు 100మీ,,లు కాగా, 140 మీ,, ఎత్తులో , షెంజియాంజు సరిహద్దుల్లో నిర్మించారు .

ఇపుడు ఈ గాజువంతెనను చూడటానికి ఆ దేశ ప్రజలేకాకుండా చుట్టుపక్కల దేశాల ప్రజలుకూడా వచ్చి, ఆ బ్రిడ్జ్ ఫై నడిచి అద్భుతమైన అనుభూతిని పొందుతున్నారు. ఈ బ్రిడ్జ్ ని 2020 లో ప్రారంభించగా అప్పటినుండి ఇప్పటివరకు పర్యాటకుల తాకిడి మాత్రం తగ్గట్లేదు. అంతటి గుర్తింపును తెచ్చుకుంది ఈ ‘బెండింగ్’ బ్రిడ్జ్.
ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ కి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ బ్రిడ్జ్ ని చుసిన కొందరు వ్యక్తులు ఆశ్చర్యానికి గురి ఐతే, మరికొందరు మాత్రం ఇది కంప్యూటర్ జిమ్మిక్కు అని తేలికగా తీసుకుంటున్నారు. ఇంకొందరు ఇలాంటివి ఎక్కడాలేవని కొట్టిపారేస్తున్నారు. అయితే, 2020 నవంబర్ నెలలో కెనడియన్ వ్యోమగామి క్రిస్ హాడ్ఫీల్డ్ ‘రూయి’ వంతెనకు సంబంధించి ఒక వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడు. దీన్ని బట్టి ఈ బ్రిడ్జ్ నిజమైనదేనని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు.