health tips in telugu
Ginger: రోజుకో అల్లం ముక్క తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు..
ప్రకృతి ప్రసాదించిన వన మూలికల్లో అల్లం ఒకటి. అల్లంలో మంచి ఔషదగుణాలు ఉండడంతో పాటు, యాంటీ ఆక్సిడెంట్‌గానూ పనిచేస్తుంది. ఆహారం రుచిని పెంచే అల్లం పోషకాల్లోనూ నెంబర్ వన్‌గా నిలుస్తుంది. అయితే అల్లం తినడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలను ఒకసారి పరిశీలిస్తే..
అల్లంలోని ఘాటైన సుగంధ తైలాలు ఆహారం రుచిని పెంచడమే కాకుండా.. ఆహారం వల్ల జీర్ణవ్యవస్థకు వచ్చే ఇబ్బందులను తగ్గిస్తాయి.

అల్లానికి రక్తంలో కొవ్వును తగ్గించే గుణాలున్నాయి.
అజీర్తితో బాధపడుతున్నవారు అల్లం సేవిస్తే ఉపశమనం లభిస్తుంది. ఉదరంలో గ్యాస్ ఏర్పడితే అల్లం దివ్యౌషదంగా పని చేస్తుంది.
దగ్గు, జలుబు, కఫం మొదలైన వాటికి అల్లం అమృతంలా పని చేస్తుంది.