health tips in telugu
Better Sleep: రాత్రి నిద్రపట్టడం లేదా.. ఇవి ట్రై చేయండి..
సరిగా నిద్ర పట్టకపోతే మనకు కొన్ని ఆహారాలు సహాయపడతాయి. మనం తీసుకొనే ఆహారాలు కొన్ని నిద్ర మీద ప్రభావం చూపుతాయి. అయితే ఇప్పుడు నిద్రకు సహకరించే సూపర్ ఫుడ్స్‌ను గురించి తెలుసుకుందాం..
రాత్రిళ్లు త్వరగా నిద్రరావాలంటే పడుకునే గోరు వెచ్చని పాలు తాగడం చాలా మంచిది. పాలలోని ట్రెప్టోఫోన్ నిద్రకు సహాయ పడుతుంది.

అరటిపండ్లను తీసుకోవడం వల్ల ఓవర్ స్ట్రెస్‌కు గురైన కండరాలను, మెదడును ఫ్రీ అవుతాయి. ఈ పండు నిద్ర పట్టడానికి బాగా సహాయపడుతుంది.
వాల్‌నట్స్‌లో మెలటోనిన్ అధికంగా ఉంటాయి. పడుకునే ముందు వీటిని తీసుకోవడం వల్ల నిద్ర క్వాలిటీని పెంచుతాయి.
సాల్మన్, తునా వంటి చేపల్లో నిద్రకు సహకరించే విటమిన్ బీ6 అధికంగా ఉంటుంది. ఇవి నిద్రకు కారణమయ్యే హార్మోన్‌లను ప్రోత్సహిస్తాయి.