amitabh bachchan tweet : విరాట్,అనుష్క ల గారాల కూతురిపై అమితాబ్ ట్వీట్…..డిస్ లైక్ లతో వైరల్ !

amitabh bachchan tweet : ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ ఈ మద్యే ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం ప్రపంచమంతా తెలిసినవిషయమే. అందరు విరుష్క దంపతులకు కంగ్రాట్స్ తెలుపుతూ వచ్చారు. అయితే విరుష్క కూతురు పై అమితాబ్ ఒక ట్వీట్ చేయడంతో ఆ ట్వీట్ కాస్త ఇప్పుడు వైరల్ మారింది. అమితాబ్ చేసిన ఈ ట్వీట్ ని కొంతమంది లైక్ చేస్తుంటే మరికొంత మంది డిస్ లైక్ చేస్తున్నారు.

ఇండియన్ క్రికెట్ టీమ్ అందరు కలిసి భవిష్యత్తులో మహిళల క్రికెట్ టీమ్‌ను రెడీ చేస్తునట్టు ఉన్నారు. అంటూ సరదాగా బిగ్ బీ తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేసాడు. అందులో జడేజా, పుజారా, సాహా, భజ్జీ, రైనా, గంభీర్, రోహిత్, షమి, రహానే, నటరాజన్, ఉమేష్ యాదవ్‌ల పేర్లు ప్రస్తావిస్తూ వీరు అందరు ఆడపిల్లలకు జన్మనిచ్చారని అలాగే ధోనికి కూడా కూతురు పుట్టింది. ఇప్పుడు విరాట్ కోహ్లీకి కూడా కూతురు పుట్టింది వీరందరూ రాబోయేరోజుల్లో మహిళల క్రికెట్ టీమ్‌ను తయారు చేస్తున్నారని ట్విట్టర్ లో పేర్కొన్నాడు.
తన ట్వీట్ కు కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తే, మరికొందరు నెగెటివ్ గా కామెంట్ చేస్తున్నారు. ఇపుడే వారి భవిష్యత్తు ఎందుకు నిర్ణయిస్తున్నారని ఫైర్ అవుతున్నారు.