Tollywood news in telugu

Anasuya: రంగమ్మత్త సినిమా పోస్టర్ వైరల్…

బుల్లితెర అందాల యాంకర్ అనసూయ ఇటు జబర్దస్త్ వంటి టీవీ షోల్లో యాంకరింగ్ చేస్తూ అటు వెండితెరపై మెరుస్తూ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం “థాంక్యూ బ్రదర్ ” అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రంలో అనసూయ చాలెంజింగ్ గా ఉన్న గర్భిణీ పాత్రలో నటించింది. తాజాగా ఆ చిత్ర పోస్టర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు.

ఈ పోస్టర్ లో అనసూయ,విరాజ్‌ అశ్విన్ ఓ లిఫ్ట్ లో ఇరుక్కుపోయి.. భయభ్రాంతులకు గురైనట్టు స్పష్టం గా కనబడుతోంది. ఈ ఆసక్తికరమైన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టర్ విడుదల చేసినందుకు అనసూయ మహేష్ బాబు కి కృతజ్ఞతలు తెలిపింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button