Anchor Lasya: నా ఛానల్ లో లైవ్ వస్తుందని… నాకే తెలీదు

ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ లాస్య ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ ప్రేక్షకులందరిని ఆకర్షించుకుంటుంది. బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు జాలీగా గడుపుతూ రోజు వంటలు చేస్తూ వంటలక్క గా గుర్తింపు పొందింది.

ముఖ్యంగా హౌస్ లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి తను ఎలిమినేట్ అయ్యే వరకు ప్రతిరోజు తన కుమారుడైన జున్ను ని తలచుకుంటూనే ఉంది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు రోజు తన కొడుకు ఫోటో చూసి మురిసిపోయేది.హౌస్ లో ఏదైనా పండగ కి ఇంటి నుండి గిఫ్టు వస్తోందంటే చాలు లాస్య చాలా ఆతృతగా వేచి చూసేది.

ఎప్పటి నుండో లాస్య “లాస్య టాక్స్” అనే యూట్యూబ్ ఛానల్ ను రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఛానల్ లో ఆడియన్స్త తో లైవ్ లో ఇంట్రాక్ట్ అవ్వడం, వంటల వీడియోలు, వ్లాగ్స్ చేస్తుండేది.

కానీ శనివారం సాయంత్రం తన ఛానల్ హాక్ అయినట్టు లాస్య వెల్లడించింది. శనివారం సాయంత్రం తన యూట్యూబ్ లైవ్ వస్తుందని పలువురు చెప్పేవరకు తనకు తెలియదని, ఆ తర్వాతే ఛానల్ హ్యాక్ అయిందని గుర్తించినట్టు లాస్య పేర్కొన్నారు. తన ఛానల్ తిరిగి వస్తుందని, తన టీం ఛానల్ ని వెనక్కి తీసుక వస్తారని లాస్య ధీమా వ్యక్తం చేశారు. తన ఛానల్ కోసం అండగా నిలుస్తున్న ఫాలోవర్స్ అందరికీ లాస్య కృతజ్ఞతలు తెలిపారు