telugu gods devotional information in telugu

Annamayya keertana

హరి కీర్తనా ప్రియుడు , అటువంటి స్వామి ఆయుధ అంశ నుండి అవతరించిన అన్నమయ్య ఆ స్వామిని సుమారు ముప్పై రెండు వేల కీర్తనలతో స్తుతించి తరించారు

ఒకనాడు స్వామి సాక్షాత్ నారద మహర్షితో అన్నారుట నా భక్తులు నన్ను అక్కడ ఇక్కడా వెతుకుతూ ఉంటారు కాని నన్ను స్తుతించే వారి గుండెల్లో ఉంటా అని

మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద

అలాంటి అపురూప మాటలే అన్నమయ్య కీర్తనలకు స్పూర్తి అలాంటి వాటిలో ఒకటి మన కోసం

అన్నమయ్య కీర్తన మూసిన ముత్యాలకేలే

మూసిన ముత్యాల కేలే మొరగులు
ఆశల చిత్తాని కేలే అలవోకలు ||

కందులేని మోమున కేలే కస్తూరి
చిందు నీ కొప్పున కేలే చేమంతులు |
మందయానమున కేలే మట్టెల మోతలు
గంధమేలే పైపై కమ్మని నీ మేనికి ||

భారపు గుబ్బల కేలే పయ్యెద నీ
బీరపు జూపుల కేలే పెడమోము |
జీరల భుజాల కేలే చెమటలు నీ
గోరంట గోళ్ళ కేలే కొనవాండ్లు ||

ముద్దుల మాటల కేలే ముదములు నీ
యద్దపు జెక్కుల కేలే అరవిరి |
వొద్దికమాటల కేలే వూర్పులు నీకు
నద్దమేలే తిరు వేంకటాద్రీశు గూడి ||

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button