Tollywood news in telugu
‘KGF’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రకటించిన మరో సినిమా !

‘కేజీఎఫ్’ సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్, ఇతను ప్రస్తుతం ‘కేజీఎఫ్ 2’ సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే దర్శకుడు నీల్ , ప్రభాస్ హీరోగా ‘సలార్’ అనే సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదిలాఉంటే ప్రశాంత్ నీల్ ఇంకో సినిమా పేరు కూడా ప్రకటించి అభిమానులకు ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శ్రీమురళి హీరోగా చేస్తున్నాడని బ్రేకింగ్ న్యూస్ వదిలాడు. నీల్ ప్రకటించిన సినిమాకు ‘బఘీరా’ అనే టైటిల్ పెట్టినట్టు తెలిపాడు. ఈ సినిమాకు ప్రశాంత్‌నీల్ కథ వ్రాయగా , డాక్టర్ సూరి దర్శకత్వం చేస్తున్నాడు.
హీరో శ్రీమురళి పుట్టినరోజు సందర్భంగా సినిమా ‘బఘీరా’ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అదేవిదంగా సలార్‌ను నిర్మించనున్న హంబలే సంస్థ ఈ చిత్రాన్నీ నిర్మించబోతోంది.