Today Telugu News Updates
హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు కానున్న మరో మణిహారం !

హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం పావులు కదుపుతుంది. ఇప్పటికే దుర్గంచెరువు పై నిర్మితమైన తీగల వంతెన హైదరాబాద్ కి మనిహారంగా మారింది.
ఇపుడు మరో మణిహారం ఎర్పాటు చేస్తునట్టు కల్వకుంట్ల తారకరామారావు తన షోషల్ మీడియా ట్విట్టర్ లో ‘స్కై వాక్’ ఫోటోని పోస్ట్ చేసాడు. ఈ నిర్మాణం పూర్తిగా స్టీల్ తో నిర్మించే విదంగా సన్నాహాలు చేస్తున్నారట.
హైదరాబాద్ మహా నగరంలో నిత్యం రద్దీగా ఉండే మెహదీపట్నం రోడ్డును ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.
మెహిదీపట్నంలో అధిక రద్దీ వల్ల ఇప్పటికే ఎంతోమంది చనిపోయారు. మరికొందరు ఆక్సిడెంట్స్ అయి ఇంటికే పరిమితం కావడం వల్ల, మళ్ళీ ఇలాంటి ఘటనలు జరుగకుండా ఉండేందుకు ఈ ప్రదేశాన్ని ఎంపిక చేశామని పురపాలక శాఖ సెక్రటరీ అరవింద్ కుమార్ ట్విట్టర్ లో తెలిపారు.