Anupriya Goenka: 18 ఏళ్ల వయసులోనే నాకు ఇలా జరిగింది … కాని ఏదోవిదంగా తప్పించుకోగలిగాను…

Anupriya Goenka : అనుప్రియ మన తెలుగు రాష్ట్రాలకు ఎక్కువగా తెలియని పేరు, కానీ ఈ అమ్మడు బాలివుడ్ లో పలు సినిమాలు చేసింది. అదేవిదంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కొంత పేరు తెచ్చుకుంది.
ఈ ముద్దు గుమ్మా సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ జిందా హై ‘ సినిమాలో నటించింది. అనుప్రియ తాజాగా ‘ఆశ్రమ్ 2’ వెబ్ సిరీస్ లో నటించింది.
ఈ అమ్మడు ప్రజలకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది అది ఏంటంటే, తాను 18 ఏళ్ళ వయసులో ఉన్నపుడు తనకి జరిగిన చేదు అనుభవాలను ఇలా ఒక ఇంటర్వ్యూ లో తెలిపింది.
మా కుటుంబ సభ్యులు ఒక బాబాను ఎంతో నమ్మేవారమని, మా ఇంట్లో ఏ శుభకార్యాన్ని ఐన తాను నిర్ణయించిన మంచిరోజు నాడు చేసుకొనేవాళ్లమని, తన మాటను వేదం లా భావించేవారమని తెల్సుపుతూ… మా నమ్మకాన్ని ఆ బాబా అలుసుగా తీసుకొని నన్ను ఒక సందర్భంలో లొంగదీసుకోవాలని ప్రయత్నించాడని , ఆ సమయంలో నేను ఏదోవిదంగా తప్పించుకోగలిగాను అని చెప్పింది.
ఆ విషయాన్ని నేను చాలా రోజులకు మా ఇంట్లోవాళ్లకు ఈ విషయాన్నీ చెప్పానని . ఇపుడు ఆ బాబా ముసలివాడు కావడంతో మా తల్లిదండ్రులు ఆయనపై ఎలాంటి చర్యలకు తీసుకోలేదని చెప్పుకొచ్చింది.