Tollywood news in telugu
రౌడీ బాయ్స్ హీరో ఆశిష్ చాలా సెల్ఫిష్ : Rowdy Boys Hero Ashish is now Selfish

అవును రౌడీ బాయ్స్ హీరో ఆశిష్ ఇప్పుడు సెల్ఫిష్ గా మారబోతున్నాడు. ఈ విషయం కొద్దిసేపటి క్రితమే దిల్ రాజు ప్రకటించారు. మ్యాటర్ లోకి వెళ్తే..
దిల్ రాజు యొక్క నిఫ్యూ అయిన ఆశిష్ రెడ్డి ఈరోజు రౌడీ బాయ్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అతను సెల్ఫిష్ గా మారబోతున్నాడు.
కంగారుపడకండి ఆశిష్ రెడ్డి హీరో గా చేయబోయే రెండవ సినిమా పేరు సెల్ఫిష్ అని స్వయానా దిల్ రాజు గారి చెప్పారు. ఈ సినిమాని సుకుమార్ దగ్గర ఎన్నో సినిమాలకి వర్క్ చేసిన కాశీ దర్శకత్వం వహించబోతున్నాడని తెలిపారు.
ఈ సినిమా సుకుమార్ రైటింగ్స్ మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఉండబోతుందని తెలిపారు. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.
చూడాలి మరి ఈ సెల్ఫిష్ సినిమా ఎలా ఉండబోతుందో.