Tollywood news in telugu
దీపిక నవ్వుకి ఫిదా ఐన పరాయి దేశం !

దీపికా పదుకొనె తన నటనతో పాటు , తన నవ్వుతో ను ప్రేక్షకుల మనసును దోచుకున్న ఈ భామ , తాజాగా గ్రీస్ రాజధాని ఏథెన్స్ ప్రజలను కూడా ఆకట్టుకుంది. అందువల్ల ఏథెన్స్ విమానాశ్రయంలో దీపిక పదుకొనె విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
కోవిడ్ కారణంగా తాత్కాలికంగా మూతపడ్డ ఏథెన్స్ విమానాశ్రయం ఓపెన్ చేసారు. విమానాశ్రయ కార్యకలాపాలను ప్రారంభించిన ప్రభుత్వం ప్రయాణీకులను ఆకట్టుకోవడానికి, వారిని చిరునవ్వుతో స్వాగతం పలకడానికి సెలబ్రిటీల్లో నవ్వుతో ఆకర్షించే సెలబ్రిటీలను ఎంపిక చేసింది. వారిలో దీపికా పదుకొనె నవ్వు కూడా ఉంది.
ఇలా ఎంపిక చేసిన సెలబ్రిటీల విగ్రహాలను తయారు చేసి ఏథెన్స్ విమానాశ్రయంలో పెట్టారు. అలా దీపిక పదుకొనె విగ్రహం ఏథెన్స్ విమానాశ్రయంలో ప్రత్యక్షమైంది. ఈ విగ్రహం కింద వైపున ఇండియన్ బాలీవుడ్ నటి అని పేర్కొనడం జరిగింది .