Tollywood news in telugu
ఆ రోజు రాత్రి జరిగిన సంఘటనపై…అవికా గోర్ ఆవేదన !

avika gor చిన్నారి పెళ్లి కూతురు టి వి సీరియల్ తో ఎంతో ఫెమ్ తెచ్చుకున్న అవికా గోర్, తెలుగు,హిందీ టివి సీరియల్స్ లో తనకంటూ ఒక ఇమేజి ని సొంతం చేసుకుంది. సీరియల్స్ లో బొద్దుగా, ఉండే అవికా ఇపుడు గుర్తు పట్టలేనంత గ్లామర్ గా తయారైంది.
తాజాగా తన షోషల్ మీడియాలో తన ఫోటో పెట్టి ఆ రోజు రాత్రి జరిగిన సంఘటను గుర్తు చేసుకొని ఈ అమ్మడు తెగ బాధ పడింది.
గత ఏడాది ఒక రోజు రాత్రి తనని తాను అద్దంలో చూసుకొని తెగ బాదపడ్డానని గుర్తుచేసుకుంది. నా శరీర భాగాలు లావుగా ఉండడంతో అద్దంలో చూసుకొని బాధ పడ్డానని, శరీర ఆకృతి ఇలా ఉందేంటి అని ఆ రోజుల్లో ఆవేదనకు లోనయ్యానని తెలిపింది.
నాపై నాకే అసహ్యం వేసేది, దీనికి పరిష్కారం వెతికి నా ఆరోగ్యం పై , ఫిట్నెస్ పెంచుకోవడం పై ద్రుష్టి పెట్టి ఇపుడు ఇలా మీ ముందు హీరోయిన్ గా ఉన్నానని ఎమోషనల్ గా పోస్ట్ పెట్టింది.