Ayyagari Cameo in Nag Ghost Movie : ఘోస్ట్ సినిమాలో అయ్యగారి గెస్ట్ రోల్ ?:-

Ayyagari Cameo in Nag Ghost Movie : ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టిన అక్కినేని అఖిల్ , ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకి సంబందించిన సక్సెస్ ప్రొమోషన్స్ లో బిజీ బిజీ గా ఉన్నారు. దీని తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వం లో చేసే ఏజెంట్ సినిమా పైన ఫోకస్ చెయ్యబోతున్నారు.
ఇదిలా ఉండగా అక్కినేని నాగార్జున గారు చేస్తున్న సినిమాలలో ఘోస్ట్ ఒకటి. ఈ సినిమాని ప్రవీణ్ సత్తారు దర్శకత్వం చెయ్యబోతున్నారు. ఈ సినిమా కంప్లీట్ నెవెర్ బిఫోర్ థ్రిల్లర్ అని పోస్టర్స్ చూడగానే అర్ధం అవుతుంది. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలయింది.
అయితే ఇపుడు ఇండస్ట్రీ లో విపరీతంగా వినిపిస్తున్న టాక్ ఏంటంటే నాగార్జున ఘోస్ట్ సినిమాలో అక్కినేని అఖిల్ స్పెషల్ రోల్ చెయ్యబోతున్నారు , ఆ స్పెషల్ రోల్ కోసం ప్రవీణ్ కొత్తగా క్యారెక్టర్ డిజైన్ చేశారని తెలుస్తుంది. ఇంకా దీనిపైనా అధికారికంగా ప్రకటన జరగలేదు కానీ నాగార్జున సినిమాలో అఖిల్ గెస్ట్ రోల్ కచ్చితంగా ఉండబోతుందన వార్త ఇండస్ట్రీ అంత చక్కర్లు కొడుతోంది.
చూడాలి మరి ఈ వార్త పై చిత్రబృందం ఎపుడు రియాక్ట్ అవుతారో. ఒకవేళ నిజం అయితే నాగార్జున సినిమాలో అఖిల్ గెస్ట్ రోల్ గా చేయడం ఇది రెండవ సారి అవుతుంది. ఎందుకంటే గతంలో మనం సినిమాలో క్లైమాక్స్ లో అఖిల్ గెస్ట్ రోల్ చేసారు ఇపుడు ఘోస్ట్ లో.
చూడాలో ఘోస్ట్ లో నాగార్జున మరియు అఖిల్ మధ్య సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయో. దీని పై చిత్రబృందం అధికారికంగా ఎపుడు ప్రకటించబోతుందో వేచి చూడక తప్పదు.