Tollywood news in telugu
మంచు పడటంతో బద్రీనాథ్ ఆలయం మూసివేత !

ఉత్తరాఖండ్ లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ఆలయ ద్వారాలు మూసేసారు. శీతాకాలం మొదలుకావడంతో దేవస్థానం బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
ఆలయ పరిసరప్రాంతాలలో మంచు అధికంగా కురుస్తున్నవేళ ఉదయం 7 గంటలకు చార్ ధామ్ ముఖ్య కార్యదర్శి బీడీ సింగ్ తో ముఖ్య అధికారులు ఆలయంలో పూజలు జరిపి వేడుకల్లో పాల్గొని ఆలయాన్ని మూసివేశారు.
కెదారినాథ్, గంగోత్రి ఆలయాలు ఇప్పటికే మూసివేయడం జరిగింది. ఈ మంచుకారణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చలికారం మొదలైన కొన్నిరోజులకే ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఆలయాన్ని మూసివేయడం జరిగింది.