Tollywood news in telugu
దుకాణం తెరచిన బండ్ల గణేష్ … మరి రేటెంతనో !

బండ్ల గణేష్ కరోనా నుండి కోలుకున్న తర్వాతనుండి చాల మారిపోయాడు. ఈ కరోనా వల్ల చావుటంచులవరకు వెళ్లి జీవితం విలువ తెలుసుకున్నానని తెలిపాడు.
ఒకప్పుడు ఎవరిమీదపడితే వారిమీద సెటైర్లు వేసుకుంటూ ఎగతాళిగా మాట్లాడే బండ్ల ఇపుడు అందరిపై ప్రేమను కురిపిస్తున్నాడు.
నాకు నా కుటుంబం ముఖ్యం మిగితావాళ్ళతో నేను ఇకనుండి గొడవలకు దిగను అని వేదాంతం వల్లిస్తున్నాడు. ఇప్పటివరకు ఎవర్నైనా బాదిస్తే నన్ను క్షమించండి అని కోరాడు.

ఈ మధ్యన బండ్ల తెలుగు ప్రజలకు సోనుసూద్ మాదిరిగా డబ్బు సహాయం, మాట సహాయం తో పాటుగా టపాసులుకూడా అందిస్తూ ఉన్నాడు.
కానీ గణేష్ ఫోటో చుసిన నేటి జన్లు బండ్ల టపాసుల దుకాణం పెట్టావా అని కామెంట్ చేస్తున్నారు.