Bangaru Bullodu Movie Review: బంగారు బుల్లోడు సినిమా హిట్టా? పట్టా?

Bangaru Bullodu Movie Review:ఆయన సినిమాలు చూస్తే ఎవరైనా పగలబడి నవ్వాలసిందే.. ఎవరైనా అతని సినిమా వస్తే ఫ్యామిలీతో కలిసి థియేటర్లో చూడాలనుకుంటారు.. అతనెవరో కాదు హీరో అల్లరి నరేష్..తన నటనతో అద్భుతమైన కామెడీ సృష్టించగల గొప్ప నటుడు. మరి అలాంటి హీరో కొత్త సినిమా “బంగారు బుల్లోడు” నేడు విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలాగుందో చూద్దాం.

ఈ చిత్రాన్నికి పివి.గిరి దర్శకత్వం వహించారు. అల్లరి నరేష్ ఈ చిత్రంలో గ్రామీణ బ్యాంకు లో పనిచేస్తూ ఉంటాడు. చిత్రం మొత్తం పల్లెటూరి నేపథ్యంలోనే కొనసాగుతుంది. అల్లరి నరేష్ తాత రోల్లో తనికెళ్ళ భరణి నటించారు. చిత్రంలో అల్లరి నరేష్ ది గోల్డ్ స్మిత్ ఫ్యామిలీ … ఊరిలో ఉండే అమ్మవారి నగలు దొంగిలించ బడతాయి.. అసలు ఎవరు ఆ నగలను ఎవరు దొంగతనం చేశారు? ఆ నగలకి ఈ అల్లరి నరేష్ ఫ్యామిలీ కి సంబంధమేంటి? వాళ్లని ఈ అల్లరి నరేష్ ఎలా పట్టుకుంటాడు అనేదే ఈ స్టోరీ మెయిన్ లైన్…

మీకు స్టోరీ లైన్ చూస్తే త్రిల్లర్ మూవీ అని అనుకోవచ్చు.. కానీ డైరెక్టర్ సినిమాను అలా న్యారాట్ చేయలేదు. అల్లరి నరేష్ బెండ్ అప్పారావ్ ఆర్.ఎం.పి చిత్రంలాగా ఔట్ డేటెడ్ కామెడీతో కొనసాగుతోంది. ఈ చిత్రంలో అల్లరి నరేష్ లో మనం ఎక్స్పెక్ట్ చేసినంత కామెడీ ఉండదు. అదేవిధంగా లవ్ ట్రాక్ కి వస్తే అంత ఆసక్తిగా లేదని చెప్పవచ్చు.

ఇంకా పర్ఫామెన్స్ విషయానికొస్తే అల్లరి నరేష్ ఎప్పటిలాగానే పాత్రలో ఒదిగిపోయాడు.హీరోయిన్ పూజ ఝవేరి పర్ఫామెన్స్ ఐతే మామూలుగానే ఉంది. అలాగే తనికెళ్ల భరణి నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదేవిధంగా కమెడియనలు పోసాని, గెటప్ శీను,మహేష్ లు మంచి కామెడీని పండించారు.

ఈ చిత్రంలో మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బానే ఉంది.. మొత్తానికి అయితే ఈ చిత్రం కామెడీ అంతగా లేక పోయిన డీసెంట్ గా ఉందని కచ్చితంగా చెప్పవచ్చు