భారతీయుడి మేకప్ ఖర్చు ఎంతో తెలుసా ?

Barathiyudu makeup cost : మన భారతదేశం ఎన్నో దశాబ్దాల తరబడి వెనుకబడి ఉండడానికి కారణం ఏంటంటే అవినీతి అన్ని… ఎవరైనా టక్కున చెప్పేస్తారు! అ అవినీతికి తొలిమెట్టు లంచం…ఈ లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం అనేది ప్రతి ఒక్కరికి సాధారణమైపోయింది… అయితే స్వాతంత్ర్య కోసం ప్రాణ త్యాగం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రతికుంటే ఈ పరిస్థితులను చూసి ఎలా స్పందిస్తారో అనే ఆలోచనల్లోంచి పుట్టిందే “భారతీయుడు”అనే చిత్రం.
ఈ చిత్రాన్నికి మోస్ట్ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కథ రాసి, దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో డ్యూయల్ హీరో పాత్రలో నటసామ్రాట్ కమల్ హాసన్ ని ఎంపిక చేశారు. మొదట ఈ చిత్రానికి హీరోయిన్ గా రాధికన్ని అనుకోగా … కొన్ని అనివార్య కారణాలవల్ల సుకన్య ని హీరోయిన్ గా తీసుకున్నారు. మరో మెయిన్ హీరోయిన్ల పాత్రకు ఐశ్వర్యరాయ్, శిల్పా శెట్టిని తీసుకుందామనుకున్నారు. కానీ వారికి డేట్స్ కుదరక నో చెప్పారు. దీంతో ముంబై సినిమాతో హిట్ కొట్టిన మనీషా కోయిరాలను ,ఊర్మిల ను ఎంపిక చేశారు. ఈ చిత్రానికి ఎ.ఆర్.రహమాన్ సంగీతం సమకూర్చారు.
ఈ “భారతీయుడు” చిత్రం షూటింగ్ ను 1995లో ప్రారంభమైంది. ఈ మూవీలోని కమల్ హాసన్ పాత్రలకు మేకప్ చేయడానికి 5 గంటల సమయం పట్టెదట…! మళ్లీ ఈ వేసిన మేకప్ తీయడానికి రెండు గంటలు పడుతుందట… ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ మేకప్ కొరకు చిత్రబృందం కోటి రూపాయలను ఖర్చు చేశారు. ఈ సినిమా షూటింగ్ ప్రసాద్ స్టూడియోలో, వాహిని స్టూడియోలో, కొన్ని పాటలు ఆస్ట్రేలియాలో చిత్రీకరించారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో మొట్టమొదట సారి విదేశాల్లో చిత్రీకరించిన చిత్రం”భారతీయుడే” కావడం గొప్ప విశేషం. ఈ చిత్రం స్పెషల్ ఎఫెక్ట్స్ కొరకు డైరెక్టర్ శంకర్ అమెరికా నుంచి గ్రాఫిక్స్ ఎఫెక్ట్ టీం తో ప్రొడక్షన్ పనులను చేయించారు. ఈ చిత్రానికి మొత్తం 40 కోట్ల బడ్జెట్ అయింది. ఈ “భారతీయుడు” సినిమాని తెలుగు హిందీ తమిళ్ కన్నడ సహ పలు భాషలో విడుదల చేశారు. ఈ చిత్రంలో ముఖ్యంగా “పచ్చని చిలుకలు తోడుంటే” పాటకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఇక ఈ పాటకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన ఏ.ఆర్ రెహమాన్ కి నేషనల్ అవార్డు దక్కింది