Batch Movie Review :-

Movie :- Batch (2022) Review
నటీనటులు :- సాత్విక్ వర్మ , నేహా పాతన్ , ప్రభాకర్ , సంధ్య జనక్ మొదలగు
నిర్మాత :- రమేష్
సంగీత దర్శకుడు :- రఘు కుంచె
దర్శకుడు :- శివ
Story (Spoiler Free):-
ఈ కథ కాలేజ్ లైఫ్ మొదలుపెట్టిన నవీన్ (సాత్విక్ వర్మ ) చుట్టూ తిరుగుతుంది. నవీన్ అందరిలాగే ఫ్రెండ్స్ తో లైఫ్ చలాకీ గా ఎంజాయ్ చేస్తుంటాడు. అందరిలాగే నవీన్ కి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉండాలని చిరకాలం కోరిక. అనుకున్నట్లే నవీన్ కి ఒక గర్ల్ ఫ్రెండ్ సెట్ అవుతుంది. ఆమెనే ప్రణతి ( నేహా పాతన్ ) . ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ గర్ల్ ఫ్రెండ్ నీ మెయిన్ టైన్ చేసేంత స్తోమేతా నవీన్ కి లేదు. ఇలాంటి సమయంలోనే నవీన్ కి క్రికెట్ బెట్టింగ్ అలవాటు అవుతుంది.
ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్ వల్ల నవీన్ లైఫ్ ఎలా మారబోతోంది ? నవీన్ మరియు ప్రణతి ప్రేమ ఎలా చిగురించింది మరియు ఎలా ఎండ్ అయ్యింది ? చివరికి ఎం జరిగింది అనేది మిగిలిన కథ.
Positives 👍:-
- హీరో గా సాత్విక్ చాలా బాగా నటించారు. నేహా కూడా మొదటి సినిమా అయినప్పటికీ బాగా నటించింది.
- కథ మరియు కథనం.
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.
- సినిమాటోగ్రఫీ బాగుంది.
- నిర్మాణ విలువలు బాగున్నాయి.
Negatives 👎:-
- పాటలు కూడా పెద్దగా అక్కటుకోవు.
- కామెడీ కూడా పెద్దగా ఆకట్టుకోదు.
Overall :-
మొత్తానికి బ్యాచ్ అనే సినిమా సాత్విక్ కి పర్ఫెక్ట్ డెబ్యూ సినిమా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. హీరో గా చాలా బాగా నటించారు. నేహా కూడా చాలా బాగా నటించింది. దర్శకుడు తాను చెప్పాలనుకున్న విషయాన్ని ఇక్కడ అనవసరపు సన్నివేశాలు లేకుండా బాగా డైరెక్షన్ చేశారు.
ఎడిటింగ్ పర్వాలేదు. కామెడీ ట్రాక్ పెద్దగా ఆకట్టుకోదు మరియు పాటలు కూడా. రఘు కుంచె మ్యూజిక్ బాగా ఇచ్చారు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి ఈ వారం ఈ సినిమా ఓసారి చుసేయచ్చు.
Rating:- 2.75/5