sidharth shukla BB13 Winner Died : బిగ్ బాస్ విన్నర్ మృతి :-

BB13 Winner sidharth shukla Died : బాలిక వధువు అనే సీరియల్ ద్వారా హిందీ లో కొన్ని లక్షలమంది ఆదరణ పొందిన నటుడు సిద్ధార్థ్ శుక్ల. తెలుగులో కూడా చిన్నారి పెళ్లి కూతురు అనే సీరియల్ ద్వారా చాల ఫేమస్ అయ్యారు. అయితే సిద్ధార్థ్ కి ఈరోజు ఉదయం 9 గంటలకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని, ముంబైలోని కూపర్ హాస్పిటల్ కి తీసుకొని పోయేలోపే చనిపోయారని హాస్పిటల్ అధికారులు చెప్తున్నారు.
ఇదిలా ఉండగా పోలీస్ బృందం సిద్ధార్థ్ బాడీ అంత చెక్ చేసి ఎక్కడ ఎటువంటి అనుమానాస్పద గాయాలు లేవు కానీ సిద్ధార్థ్ ఎలా చనిపోయారనేది ఇంకా విచారణ చేయవలసి ఉంది అని వెల్లడించారు.
అయితే సిద్ధార్థ్ హిందీ బిగ్ బాస్ సీజన్ 13 లో పాల్గొని విన్నర్ అయినా విషయం మనందరికీ తెలిసిందే. కానీ సిద్ధార్థ్ గొప్ప విజయం అందుకొని ఏడాది కాకముందే ఇలా చనిపోవడం చాల బాధాకరం అని అతని సన్నిహితులు బాధను వ్యక్తం చేస్తున్నారు.
సిద్ధార్థ్ కి తల్లి మరియు ఇద్దరు చెల్లెలు ఉన్నారు. సిద్ధార్థ్ బాబుల్ గా అంగన్ చోటే హై అనే సినిమా ద్వారా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. అయినా కూడా చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా వచ్చిన విజయం అంత ఇంత కాదు. 2014 లో కారన్ జోహార్ నిర్మించిన హంప్టీ శర్మ కీ దుల్హనియా అనే చిత్రం ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారు. అన్ని అనుకున్నట్లు కెరీర్ బాగా సాగుతున్న సమయం లో ఇలా చనిపోవడం చాల బాధాకరంగా ఉంది.
sidharth shukla మరణ వార్త విని ఇండస్ట్రీ లోని సెలబ్రిటీస్ అందరు వారి బాధలను ట్విట్టర్ రూపం లో వ్యక్తం చేస్తున్నారు. సిద్ధార్థ్ బాడీ ని వారి నివాసానికి తీసుకొని వెళ్లి మిగిలిన కార్యక్రమాలు చేయనున్నారు. చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ తో చనిపోయిన సిద్ధార్థ్ ఆత్మ శాంతి కలగాలని కోరుకుందాం.