సింగరేణి ముద్దుబిడ్డ బిగ్ బాస్ కప్పు కొడతాడా??

bb sohel : బిగ్బాస్ సీజన్ 4లో మాస్ కా దాస్,సింగరేణి ముద్దుబిడ్డ సయ్యద్ సోహెల్ రియాన్… గోదావరిఖనికి చెందిన సింగరేణి కార్మికుడి కొడుకైన సోహెల్… తన యాస భాషలతో బిగ్ బాస్ షో ని అల్లాడిస్తున్నాడు…

బిగ్బాస్ 4 స్టార్ట్ కాకముందు… ఇతని గురించి ఎవరికీ తెలీదు… ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏండ్లయినా సరైన గుర్తింపు దొరకలేదు…కొత్త బంగారులోకం, డి ఫర్ దోపిడి ,అంతకు ముందు..ఆ తర్వాత,యురేకా చిత్రాల్లో నటించిన సయ్యద్ సోహెల్.. కృష్ణవేణి సీరియల్ తో పాపులర్ అయ్యాడు..

తను చెప్పాలనుకున్న మాటను సూటిగా సుత్తి లేకుండా చెప్పేయడం సాహెల్ లక్షణం… తనకు కోపం వస్తే నరాలు ఉప్పొంగుతాయి… సాహెల్ అగ్రెసివ్ నెస్ కి బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది… కోపంలో సోహెల్ ప్రవర్తించే తీరు,బాడీ లాంగ్వేజ్, ఊత పదాలను ఇష్టపడే వాళ్లతో పాటు… వ్యతిరేకించే వాళ్లు కూడా ఉన్నారు… నవ్వుతూ నవ్విస్తూ సోహెల్ బిగ్ బాస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారాడు…
మొత్తంగా సోహెల్ టాప్ 5 లోనే కాదు… టాప్ 3 లో ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఈ వారంలో సింగరేణి కుర్రాడు తన పూర్తి స్థాయి పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటే…కథ వేరే ఉండటం ఖాయం… అలాగే టైటిల్ పోరులో ఉన్న మరో కంటెస్టెంట్ అబిజిత్ కి గట్టి పోటీ ఇవ్వడం కన్ఫామ్ అని విశ్లేషకులు చెబుతున్నారు… మరి మన సింగరేణి ముద్దుబిడ్డ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవుతాడో? లేదో ముందుముందు చూడాలి..