సోహైల్ కోపానికి కారణం ఇదేనా?

Bb4 angry Sohail :: సోహైల్ మొదట్లో అవేశ పరుడు ముక్కోపి అని పేరు తెచ్చుకున్న, రాను రాను టాస్క్స్ బాగా అడుతు మంచి కాంపిటీటర్ అని పేరు తెచ్చుకున్నాడు, నాగార్జున కోపాన్ని అదుపులో పెట్టుకో అని వీకెండ్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. కానీ సోహైల్ అదుపులో పెట్టినట్టు ప్రయత్నం చేసి కోపాన్ని ఇంకో రకం గా ప్రదర్శిస్తున్నాడు, రెచ్చగొడితే రెచ్చిపోయి అదుపులో పెట్టుకున్నట్టు ఆక్ట్ చేసి , ఎదుటి వాళ్ల పైన ఎక్స్ప్రెషన్ రూపంలో, వాళ్ళు లేనపుడు గోడలు గుద్దడం ప్రదర్శించిన అది అదుపులో పెట్టుకోవటం అని ఎవరు అనలేరు, పోతే మరి ఇంత కోపం ప్రదర్శిస్తూ టాప్ 5 లో కూడా వెళ్ళటం కష్టమే…జనాలు కోపాన్ని ఒక మేరకు ఆక్సెప్ట్ చేస్తారు . అంతకు మించి అంటే చిరాకు తెప్పిస్తుంది. ఇపుడు సోహైల్ విషయంలో జరిగేది అదే.
ఇదంతా తన గేమ్ ప్లాన్ అయి ఉండొచ్చు, తన పైన అటెన్షన్ కోసం చేయొచ్చు అనుకున్న మరి ఓవర్ అటెన్షన్ కోసం వెళ్లిన తన కోపమే తన శత్రువు గా మారి టాప్5 లో ఉండే కంటేస్తంట్ ముందే బయటకి వెళ్లొచ్చు.
బిగ్ బాస్ అంటే జనాలకి కనెక్ట్ అవాలి, జనాలకి కనెక్ట్ గాని అయితే వాళ్ల టాస్కులు, వాళ్ళు ప్రదర్శించే పెర్ఫార్మెన్స్ లు చూడరు, ఇదే bb3 లో చూసాము. మరి ఈ కోపాన్ని బిగ్ బాస్ ఆపి బుధ్ధి చెప్పగలడ? లేదా జనాలే బయటకి పంపిస్తారా చూడాలి.