Today Telugu News Updates
యాపిల్ స్టోర్ తో జాగ్రత్తగా ఉండండి !

తాజాగా అక్కినేని నాగార్జున ఓ ప్రముఖ వ్యాపార సంస్థపై మండిపడ్డారు. అంతర్జాతీయంగా ఎంతో పేరును తెచ్చుకున్న యాపిల్ సంస్థపై విమర్శలు కురిపించారు. ఇండియాలో ఉన్న యాపిల్ స్టోర్లలో ఆ కంపెనీకి చెందిన బ్రాండ్లను కొనేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
ఈ మధ్య యాపిల్ వాళ్ల సర్వీసెస్, పాలసీలు సరిగా లేవని… వాళ్లకు అనుకూలంగా మార్చుకుంటున్నారని చెప్పారు. వారి పాలసీలు చాలా దారుణంగా ఉన్నాయని విమర్శించారు. నాగార్జున చేసిన పోస్టుకు అభిమానుల నుండి బారి స్పందన వస్తోంది. నాగ్ ఆరోపణలపై యాపిల్ సంస్థ ఏమి స్పందిస్తుందో చూడాలి .