Today Telugu News Updates
బీరును ఒక మంచిపనికి ఉపయోగించిన మందుబాబు !

బీరు హెల్త్ ని పాడుచేస్తుంది కానీ, మంచిపనులు కూడా చేస్తుందా అనుకుంటున్నారా ! అవును నిజమే అంటుంది. ఈ సంఘటన, వివరాల్లోకి వెళ్తే …
బవేరియాలోని హెస్బాచ్ పట్టణంలో నివసిస్తున్న ఓ వ్యక్తి బీరు బాటిళ్లును కొనుగోలు చేసి తన కారులో పెట్టుకొని వెళ్తుండగా, అకస్మాత్తుగా తన కారులో మంటలు చెలరేగాయి. వెంటనే ఏంచేయాలో తెలీక ఫైర్ ఇంజన్ కి కాల్ చేసాడు.
కానీ ఫైర్ ఇంజిన్ వచ్చేసరికి తన విలువైన కారు కాలిపోతుంది అని గమనించి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన దగ్గరున్న బీర్లను ఉయపయొగించి వెంటనే మంటలను ఆర్పాడు.
అతని తెలివికి మెచ్చిన ఫైర్ ఇంజర్ అధికారులు అతనిపై ప్రశంసల జల్లు కురిపించారు.
కొందరికి అనుమానం రావచ్చు ఆల్కహాల్ వాడితే మంటలు ఎగసిపడాలి కానీ ఆరిపోవడం ఏంటని.
కానీ బీరులో 90 నుండి 95 శాతం వరకు నీరు ఉంటుంది. అందువల్లే మంటలు సులభంగా ఆరిపోవడానికి బీరు ఎంతగానో ఉపయోగ పడింది.