Bellamkonda Ganesh Debue Film : స్వాతిముత్యం గా బెల్లంకొండ గణేష్ :-

Bellamkonda Ganesh Debue Film : ఇప్పటికే మీకు మ్యాటర్ అర్ధం అయిపోయింటది. బెల్లంకొండ గణేష్ అంటే ఎవరో అనుకునేరు. అతను మన అల్లుడు శీను తమ్ముడు. అదేనండి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు.
బెల్లంకొండ గణేష్ డెబ్యూ ఫిలిం చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ వార్త ప్రేక్షకుల ముందుకు కరోనా రాక ముందు వచ్చింది. ఇప్పటికి ఈ సినిమా మీద ఒక వార్త రాలేదు.
ఇదిలా ఉండగా ఈరోజు బెల్లంకొండ గణేష్ పుట్టినరోజు సందర్బంగా అతని తదుపరి చిత్రాలకు సంబంధించిన వివరాలు పోస్టర్ల రూపం లో వదలగా, అందులో ఒకటే ఈ స్వాతిముత్యం.
ఇతను చేసే అన్ని సినిమాల పోస్టర్లు వచ్చాయి ఒక డెబ్యూ ఫిలిం కి సంబంధించి తప్ప. దీని బట్టి ఎం అర్ధం అవుతుంది అంటే గణేష్ చేసే మొదటి సినిమా ఆగిపోయింది. కాబట్టి ప్రస్తుతం అతను చేసే రెండవ సినిమానే మొదటి సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అదే స్వాతిముత్యం.
ఈ సినిమాని డెబ్యూ డైరెక్టర్ లక్ష్మణ్ దర్శకత్వం వహిస్తున్నారు. సగం పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సూర్య దేవర నాగ వంశి నిర్మించగా , మహతి స్వర సాగర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి లో ఈ సినిమాని విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు.