వీటిని నానబెట్టి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Health Tips: కొన్ని పదార్థాలను నానబెట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు మరెన్నో లాభాలుంటాయి. అవేంటో ఏఏ పదార్థాలు అలా తీసుకోవచ్చో ఓ లుక్కేద్దాం…
మెంతులు: రెండు చెంచాల మెంతుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినాలి. ఆ నీటిని ఉదయాన్నే తాగాలి. రోజూ ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వీటిలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది ప్రేగులను శుభ్రపరిచి, మలబద్ధకం లేకుండా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
అవిశ గింజలు: వీటిలో పీచు, యాంటి యాక్సిడెంట్లు, విటమిన్-బి, ఇనుము, మాంసకృత్తులు, ఒమేగా-3 ఫ్యాటీయాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. రోజూ చెంచా నానబెట్టిన అవిశగింజలను తీసుకుంటే బరువు తగ్గడంతోపాటు, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

బాదం: రోజు నానబెట్టిన ఐదారు బాదం పప్పులను తింటే మెదడు చురుకుగా పనిచేస్తుంది. వీటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు, బరువు అదుపులో ఉంటుంది.
ఎండు ద్రాక్ష: వీటిలో ఇనుము, యాంటీ యాక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. రోజూ 10 నుంచి 12 నానబెట్టిన కిస్‌మిస్‌లను తినడం వల్ల ఇనుము సమృద్ధిగా శరీరానికి అందుతుంది.