ఇలా చేస్తే ఇమ్యూనిటీ పవర్‌ని అలా పెంచుకోవచ్చు
Garlic and Honey: మీరు త్వరగా అలసిపోయి నీరసించిపోతున్నారా?. అలా పదేపదే జరుగుతోందా ఒకవేళ ఈ లక్షణాలు మీలో కనిపించి ఉంటే శరీరం వ్యాధినిరోధక సామర్థ్యాన్ని కోల్పోతోందని సూచన. తాజా పరిశోధనల ప్రకారం అందరి ఇంట్లో సాధారణంగా ఉండే వెల్లుల్లి, తేనె రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి మెరుగవుతంది. అంతేగాక తరచూ తేనె, వెల్లుల్లి మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి.

పరగడుపున వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని తీసుకోవడం వ్యాధి నిరోధక సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎటువంటి వ్యాధులు రాకుండా జాగ్రత్తపడొచ్చు.
ఈ మిశ్రమం గొంతులో ఇన్‌ఫెక్షన్‌ని, గొంతు నొప్పిని నివారిస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల వాపును తగ్గిస్తుంది.
జీర్ణవ్యవస్థకు సంబంధించి ఎలాంటి వ్యాధినైనా నయం చేసే సామర్థ్యం ఈ మిశ్రమానికి ఉంది.
వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జలుబు, ఫ్లూ, సైనసైటిస్‌ను నివారించవచ్చు.