Most Beautiful Telugu Serial Actress: సినిమా హీరోయిన్ ని మించిన అందాలు వీరివి!
Best Telugu Serial Actress : బుల్లితెర.. ఈ పేరు వింటే మనకు మొదట గుర్తుకు వచ్చేది సీరియల్….ప్రస్తుతం టీవీ చానల్ లు టిఆర్పి రేటింగ్ కోసం రకరకాల కాన్సెప్ట్ లతో సీరియల్ ని రూపొందించి టీవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు..ఈ సీరియల్స్ లో నటించే ప్రధాన పాత్రలకు హీరోయిన్ లకు ఉన్నత స్టార్ ఇమేజ్ ఉందంటే మీరు నమ్ముతారా వారి నటన, అందచందాలతో ప్రేక్షకులనే మైమరపిస్తునన్నారు…
1.సుజాత…
ఈ పేరు సీరియల్ ప్రేమికులకు సుపరిచితమే..ఈమె పసివాడి ప్రాణం,తాళి, తళంబ్రాలు, సమరసింహారెడ్డి, ఆజాద్, ప్రయత్నం, గోరింటాకు, జై చిరంజీవా వంటి చిత్రాల్లో నటించింది..కలవారి కోడలు, కర్తవ్యం, సుందరకాండ, గంగోత్రి వంటి ఎన్నో సీరియల్స్‌లో నటించింది… ప్రస్తుతం వదినమ్మ సీరియల్ లో నటిస్తుంది..

2.ప్రేమి విశ్వనాథ్..
ప్రేమి విశ్వనాథ్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు …కానీ వంటలక్క పేరు తెలియని వారు ఉండరు… కార్తీకదీపం సీరియల్ లో తన నటనా చాతుర్యంతో ప్రేక్షకులని మంత్ర ముగ్ధుల్ని చేసింది ….ఈమె “కారుముత్తు’ అనే మలయాళం సీరియల్‌తో బుల్లి తెరకు పరిచయమైంది… ప్రస్తుతం ఈమె నటిస్తున్న కార్తీకదీపం టిఆర్పి రేటింగ్లో అగ్రస్థానం సాధించడం విశేషం…

3.ప్రియాంక జైన్
మౌనరాగంలో సీరియల్ లోని మూగ అమ్మాయి పాత్రలో ప్రియాంక జైన్ అద్భుతంగా నటిస్తుంది..ప్రియాంక జైన్ బుల్లితెర కంటే ముందే వెండి తెరకు పరిచయమైంది…చల్తే చల్తే’, ‘వినరా సోదరా వీర కుమారా’, ‘ఎవరూ తక్కువ కాదు’ వంటి సినిమాల్లో మెరిసింది…

4.ఐశ్వర్య
ఐశ్వర్య…అగ్నిసాక్షి సీరియల్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ఈ సీరియల్ లో గౌరీ పాత్రలో పద్ధతైన అమ్మాయిగా… ఈ బెంగళూరు భామ మెరిసింది

5.చైత్ర రాయ్
ఈ బెంగుళూరు ముద్దుగుమ్మ అష్టా చమ్మా’ సీరియల్ ఫేమ్‌తో వచ్చిన ఈమె.. అక్కాచెల్లెల్లు, మనసున మనసై, దటీజ్ మహాలక్ష్మీ వంటి తెలుగు సీరియల్‌లో కథానాయికగా నటించింది… ప్రస్తుతం అత్తారింట్లో అక్క చెల్లెలు అనే సీరియల్ లో డబల్ రోల్ లో నటిస్తోంది
