Tollywood news in telugu

Bheemla Nayak Love song on the way : దసరా కానుకగా భీమ్లా నాయక్ లవ్లీ పాట విడుదల :-

Bheemla Nayak Love song on the way

Bheemla Nayak Love song on the way : మలయాళం లో బ్లాక్ బస్టర్ అయినా అయ్యప్పనుం కోశియుమ్ అనే సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ మరియు రానా కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే , ఈ సినిమా టైటిల్ గా భీమ్లా నాయక్ అని కూడా పెట్టారు.

అయితే సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పటినుంచి ఇప్పటిదాకా ముచ్చటగా మూడు అప్ డేట్స్ ఇచ్చారు చిత్ర బృందం. అందులో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలియాస్ భీమ్లా నాయక్ గ్లింప్స్ , డేనియల్ శేఖర్ గా రానా దగ్గుపాటి గ్లింప్స్ , చిట్టా చివరిగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా భీం భీం భీమ్లా నాయక్ అనే టైటిల్ సాంగ్.

ఇప్పటివరకు రిలీజ్ అయినా 3 రకాల ప్రోమోలకి , పాటకి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంత కాదు. ఫ్యాన్స్ కె కాదు , అన్ని వర్గాల ప్రేక్షకులని విపరీతంగా నచ్చేసాయి.

మ్యాటర్ లోకి వెళ్తే ఇన్ని రోజులు మాస్ ఫీస్ట్ ఇచ్చిన ఈ చిత్రబృందం ఇపుడు క్లాసిక్ లవ్లీ ఫీస్ట్ ఇవ్వడానికి సర్వం సిద్ధం అయింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరియు నిత్యా మీనన్ మధ్య సాగబోయే లవ్ సాంగ్ ని దసరా కానుకగా విడుదల చేయబోతున్నారు.

‘అంతా ఇష్టం ‘ అనే లిరిక్ తో సాగబోయే ఈ పాట పూర్తి లవ్ సాంగ్ గా , అందరిని అలరిస్తుంది అని చిత్రబృందం చాల కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ పాట దసరా కనుకుగా అక్టోబర్ 15 న విడుదలకు సిద్ధం అయింది.

ఇదిలా ఉండగా ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ విషయం లో వెనకడుగు వేసేదే లేదు అని , జనవరి 12 న థియేటర్లో విడుదల అవుతుంది అని చిత్రబృందం మరల పోస్టర్ రూపం లో తెలిపారు. చూడాలి మరి పవన్ కళ్యాణ్ మరియు నిత్యామీనన్ మధ్య సాగే అంతా ఇష్టం లవ్ సాంగ్ ఎలా ఉండబోతుందో.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button