బిగ్ బాస్ 4 ఉంటుందా అన్నదానికి స్టార్ మా సమాధానం .

Bigboss4 announced by maa tv: ఇన్నిరోజులు ప్రేక్షకులు అసలు ఈ ఏడాది బిగ్ బాస్ షో ఉంటుందా? ఉంటె ఎలా చేస్తారు? అసలు చేస్తారా లేదా? అది కరోనా టైంలో!!! అనే సందిగ్ధంలో జనాలు ఉంటె , కొంతమంది అయితే ఏకంగా బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్స్ లిస్ట్ పెట్టి వీళ్ళే ఈ సారి మనల్ని అలరించేవాళ్లు అని ప్రచురించారు.
స్టార్ మా టీం ఈరోజు సాయంత్రం బిగ్ బాస్ – 4 ఖచ్చితంగా ఉంటుంది అని సీజన్ 4 కి సంబంధించిన ప్రోమో వీడియో పెట్టి కన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే మిగితా విషయాలు త్వరలో వెల్లడించబోతున్నట్టు ప్రకటించారు. ఇక షో లేదనే వాళ్ళకి బిగ్ బాస్ సమాధానం ఇచ్చేసింది స్టార్ మా లో.
అయితే ఇందులో హోస్ట్ ఎవరో అనే ఉత్సుకథకి మరి కొన్నిరోజుల్లో ప్రోమో రిలీజ్ చేసి సర్ప్రైజ్ చేయనున్నారు , అయితే కంటెస్టెంట్స్ మాత్రం షో స్టార్ట్ వరకు సస్పెన్స్ గానే ఉంచుతారు స్టార్ మా వాళ్ళు , ఇప్పటికి రవి లాస్య , బిత్తిరి సత్తి , తరుణ్ పేర్లు జోరుగా వినబడుతున్నాయి