telugu bigg boss

bigg boss 4 telugu : ఎవరితో డేట్ చేస్తావ్అంటూ సంచలన వాక్యాలు చేసిన సుదీప్ !

bigg boss 4 telugu

రోజు రోజుకు ఆసక్తిగా రేకెత్తిస్తున్న బిగ్ బాస్ షోలో ఎవరు విజేతగా నిలుస్తారని ప్రేక్షకులంతా  ఎదురుచూస్తున్నారు. ఇక నేడు ఆదివారం కావడంతో  కంటెస్టెంట్ లో జోష్ నింపడానికి నాగార్జున స్పెషియల్ పర్సన్ తో రానున్నాడు.

 గ‌తంలో బిగ్ బాస్ షో ద్వారా కొంతమంది  స్టార్స్ వారి సినిమాల‌ని ప్ర‌మోట్ చేసుకున్నారు. కానీ ఈసారి కోవిడ్  కారణంగా  ఎవ్వరు  రాలేదు. కానీ ఈ రోజు మాత్రం    క‌న్న‌డ స్టార్ హీరో కిచ్చా సుదీప్ త‌న తాజా చిత్రం ఫాంథ‌మ్ ప్రమోష‌న్‌లో భాగంగా బిగ్ బాస్ షోకు వచ్చారు.   దీనికి  సంబంధించిన ప్రోమోను కూడా విదుదల చేశారు బిగ్ బాస్ టీమ్ .

నాగ్ ప్లేస్ లో హోస్ట్ గా సుధీప్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇంటి సభ్యులందరు షాక్ అయ్యారు. అరియనా నాగ్ సార్ ఎక్కడ అని అడగడంతో సుదీప్ ఇంటికి వెళ్లిపోయారు అని చెప్పారు.  తర్వాత మీకు నాగ్ సార్ ఎందుకు కావలి అని సుదీప్ అడగడంతో హారికా వీ లవ్ నాగ్ సార్ అని బదులిచ్చింది . ఆతర్వాత అభిజీత్ నాగ్ సార్ కింగ్, అంటూ పొగిడేసాడు.

వెంటనే నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. ఆతర్వాత అవినాష్ ను బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ముగ్గురు అమ్మాయిల్లో ఎవరితో డేట్ చేస్తావ్.?, ఎవరిని పెళ్లిచేసుకుంటావ్.?, ఎవరిని చంపేస్తావ్.? అని అడిగి ఒక ఆట ఆదుకున్నాడు  సుదీప్.

ఇక మోనాల్ మీరంటే  నాకు చాలా ఇష్టం అంటూ  సుదీప్ ను ఫిదా చేసింది. అయితే ఈ వారం ఎలిమినేట్ అయినా కూడా బిగ్ బాస్ ఇచ్చిన ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉపయోగించి తనను తాను సేవ్ చేసుకున్నాడు. 

దాంతో ఈ వారం నో ఎలిమినేషన్ ఉండదు . ఆ తర్వాత వచ్చే నాలుగు వారాల్లో రెండు వారాల్లో ఇద్దర్ని ఎలిమినేట్ చేసి..చివరి రెండు వారాల్లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఉంటారు. వీరిలో ముగ్గురు కంటెస్టెంట్స్ ని ఇంటికి పంపించగా  ఇద్దరు మిగులుతారు. ఆ ఇద్దరిలో బిగ్ బాస్ 4 విజేతను ప్రకటించనున్నారు

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button