telugu bigg boss

Bigg Boss Telugu 5 Day 18, September 23, Live Updates

bigg-boss-live-Updates
Bigg Boss day 18 Live Updates

Bigg Boss Telugu Day 18 Live Updates : 10:00 PM : – ఈరోజు బిగ్ బాస్ లో కెప్టెన్సీ టాస్క్ మరియు కంటెస్టెంట్స్ అందరి మొదటి ప్రేమ సంఘటన గురించి చర్చించే ఎపిసోడ్ అని ప్రోమోస్ ద్వారా తెలిసిందే. ఈరోజు ఈ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో మరి. లైవ్ అప్ డేట్స్ ఇయడానికి మేము రెడీ మరి చదవడానికి మీరు రెడీ నా ? అయితే పేజీ ని రిఫ్రెష్ చేస్తూ లైవ్ అప్ డేట్స్ ఎంజాయ్ చేయండి.

10:20PM :- ఈరోజు బిగ్ బాస్ 18 వ రోజు ఉదయం 9 గంటలకు ఆలా వైకుంఠపురం లో సినిమా లోని సమజవరాగమనా అనే పాట తో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని నిద్ర లేపగా కంటెస్టెంట్స్ తమదైన స్టైల్ లో డాన్స్ వేస్తూ షో మొదలయింది.

తర్వాత హమీద తనకి తాను బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చుకుంటాన అని మానస్ కి చెప్తుంది. దానితోపాటు విశ్వా పైన నెగటివ్ గా చెప్తుంది.

ఇపుడు కెప్టెన్సీ పోటీ కి సమయం అయింది. బిగ్ బాస్ రవి సీక్రెట్ టాస్క్ లో గెలిచినందుకు రవి ని కెప్టెన్సీ కాంటెండర్ గా ఉన్నారని చెప్పారు. ఇపుడు హైదరాబాద్ అమ్మాయి టీం నుంచి ఒకరు , అమెరికా అబ్బాయి టీం నుంచి ఒకరు మరియు మిగితా వాలా ఉంచి ఒకరిని ఎంచుకొని ఏకాభిప్రాయం తో చెప్పాలని బిగ్ బాస్ చెప్పారు. ఇపుడు కంటెస్టెంట్స్ తమ, తమ గ్రూప్స్ తో మాట్లాడుకుంటున్నారు. ఇపుడు కెప్టెన్సీ పోటీ లో పోటీదారులుగా రవి , జెస్సీ , శ్వేత , శ్రీరామ్ పోటీ చేస్తున్నారు.

మధ్యాహ్నం 1:30 నిమిషాలకు లోబో రవి కలిసి కామెడీ చేస్తున్నారు. సాయంత్రం 4:15 నిమిషాలకు రవి మరియు నటరాజ్ మాస్టర్ కలిసి కెప్టెన్ ఎవరైతే బాగుంటుంది అని చర్చిస్తున్నారు.

తర్వాత నటరాజ్ మాస్టర్ కెప్టెన్సి టాస్క్ గురించి చెప్తున్నారు. టాస్క్ పేరు స్వింమ్ జరా స్వింమ్. ఈ టాస్క్ లో క్యాప్టియన్సీ పోటీదారులు పూల్ లో దిగి వారి వారికీ ఇచ్చిన స్లాట్స్ లో కెప్టెన్ అనే పదం త్వరగా ఫిట్ చేస్తారో వారే తదుపరి కెప్టెన్. ఈ టాస్క్ లో సంచాలకులుగా లోబో చేస్తున్నారు.

తర్వాత షణ్ముఖ్ మరియు సిరి మధ్య కామెడీ కాస్త ఫైట్ జరుగుతుంది. సిరి లోన్లీ అని బాధపడుతుంది. షణ్ముఖ్ సిరి ని వెళ్ళిపో ఆనగా సిరి ఏడుస్తూ వెళ్ళిపోయింది.

సాయంత్రం 5:00 గంటలకు బిగ్ బాస్ సైరన్ మోగగా కెప్టెన్సీ పోటీదారులు పూల్ లో దిగి తమ స్లొట్స్ కి సెట్ ఆయె పాదాలు తీసుకొని వచ్చి సెట్ చేస్తున్నారు. రవి మరియు జెస్సీ కొంచెం తేడాతో మిగతా కంటెస్టెంట్స్ కంటే ముందంచునా ఉన్నారు. మొత్తానికి అందరికంటే ముందు జెస్సీ కెప్టెన్ అనే స్లాట్ ఫిక్స్ చేయడం తో జెస్సీ ఈ టాస్క్ గెలిచారు. సంచాలకుడు అయినా లోబో మొత్తం పరిశాలిస్తున్నారు. బిగ్ బాస్ ఇంటి తదుపరి క్యాప్టియన్ అయినా జెస్సీ ని అభినందిస్తున్నారు. విశ్వా కెప్టెన్ బ్యాండ్ తీసుకొని వచ్చి జెస్సీ కి వేశారు.

తర్వాత జెస్సీ కంటెస్టెంట్స్ అందరిని కూర్చోబెట్టి రేషన్ మేనేజర్ గా షణ్ముఖ్ ని ఫిక్స్ చేశారు. కిచెన్ లో ఎవరు ఉండాలని ఆలోచిస్తున్నారు బ్రేక్.

10:50PM :- బ్రేక్ తర్వాత సాయంత్రం 6:30 నిమిషాలకు సిరి మరియు కాజల్ కలిసి మాట్లాడుతున్నారు. సిరి షణ్ముఖ్ గురించి చెప్పి బాధపడుతుంది. ఇంకో పక్క షణ్ముఖ్ మిగతా కంటెస్టెంట్స్ తో నవ్వుతు మాట్లాడుతున్నారు. సిరి సెపెరేట్ రూమ్ లో కూర్చొని ఏడుస్తుంది. తర్వాత జెస్సీ ముందరుండి సిరి మరియు షణ్ముఖ్ ని కలిపే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత లోబో , యని మాస్టర్ మరియు నటరాజ్ మాస్టర్ కలిసి కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుతున్నారు.

రాత్రి 8:45 నిమిషాలకు రవి బిగ్ బాస్ ఇచ్చిన పేపర్ చసదువుతున్నారు. టాస్క్ పేరు మరుపురాని తొలిప్రేమ. కంటెస్టెంట్స్ అందరు గార్డెన్ ఏరియా లో ఉన్న బెలూన్ లో మొదటి లవ్ పేరు రాసి, ఎందుకో రీసన్ చేపి బెలూన్ ని గాలిలో ఎగిరేయాలి.

ముందుగా షణ్ముఖ్ తన 8 వ తరగతి లవ్ స్టోరీ చెప్పారు. తర్వాత సిరి బెలూన్ పైన విష్ణు అని రాసి తన 10 వ తరగతి లవ్ స్టోరీ చాల ఎమోషనల్ గా చెప్పింది.చనిపోయిన తన లవర్ ని తలుచుకుంటూ బాధ పడుతుంది సిరి. ప్రియాంక వచ్చి ఊదారుస్తుంది. సిరి బెలూన్ ని వదిలింది.

తర్వాత విశ్వా తన 5 వ తరగతి లవ్ స్టోరీ చాల కామెడీ గా చెప్పారు. తదుపరి తన భార్య గురించి చెప్పి బాధపడ్డారు. తర్వాత ప్రియాంక బెలూన్ పైన రవి అని రాసి చెప్పి తనతో జరిగిన లవ్ స్టోరీ చెప్పింది. ప్రియాంక వన్ సైడ్ లవ్ స్టోరీ అని చెప్పి బాధపడింది. తర్వాత యని మాస్టర్ బెలూన్ పైన ప్రమోద్ అని రాసి తన డిఫరెంట్ లవ్ స్టోరీ చెప్పింది. తన భర్త గురించి చాల మంచిగా చెప్పింది యని మాస్టర్.

తర్వాత రవి భార్య గురించి చెప్పి చాల ఎమోషనల్ అయ్యారు. తన భార్య పేరు బెలూన్ పైన రాసి గాల్లో వదిలారు. తర్వాత నటరాజ్ మాస్టర్ తన భార్య తో గడిపిన లవ్ స్టోరీ గురించి చెప్పారు. తర్వాత జెస్సీ బెలూన్ పైన చిన్ని అని రాసి తన క్లాస్ మేట్ తో జరిగిన లవ్ స్టోరీ చేపి అందరిని నవ్వించారు. జెస్సీ లవ్ స్టోరీ చాల విచిత్రంగా ఉంది బ్రేక్.

10:58PM:- బ్రేక్ తర్వాత ప్రియా వచ్చి బెలూన్ పైన కేక్ అని రాసింది. తన లవ్ స్టోరీ 10 వ తరగతి నుంచి మొదలయింది అని అప్పటినుంచి ఇప్పటివరకు తన లవ్ స్టోరీ అంత చాల ఎమోషనల్ గా చెప్పింది. తర్వాత కాజల్ వచ్చి తన లవ్ స్టోరీ చాల ఆనందంగా చెప్తుంది. తన తల్లిదండ్రుల గురించి చెప్తూ బాధపడుతుంది బ్రేక్.

11:05PM:- బ్రేక్ తర్వాత లోబో వచ్చి తన 14 ఏళ్ళ లవ్ స్టోరీ గురించి కామెడీ గా చెప్పారు. బెలూన్ పైన శృతి అని రాసారు విరి లవ్ బ్రేక్ అయింది అని చేపి బాధ పడ్డారు. ఇంతటితో ఈరోజు బిగ్ బాస్ సమాప్తం.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button