telugu bigg boss

Bigg Boss Telugu Season 5 Grand Finale Live Updates :-

bigg boss season 5
Bigg Boss Season 5 Grand Finale Live Updates

యావత్ ప్రజలందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే కి సర్వం సిద్ధం చేశారు. టాప్ 5 లో సన్నీ , శ్రీరామ్ , మానస్ , షణ్ముఖ్ , సిరి ఉన్నారు. వీరిలో 50 లక్షలు మరియు సువర్ణ భూమి వారు ఇచ్చే స్థలం ఎవరు తీసుకుంటారో ఈరోజు తెలిసిపోతుంది. లైవ్ అప్డేట్స్ ఇయ్యడానికి మేము సిద్ధం మరి మీరు.

పేజీ నీ రిఫ్రెష్ చెస్తుండండి లైఫ్ అప్డేట్స్ ఎంజాయ్ చేయండి.

5:30 PM: – Many celebrities along with the Bigg Boss team are ready to give 5 much entertainment. You already know who those celebrities are in the promos. Are you ready to watch the Biggest Grand Finale in another 30 minutes?

6:25 PM :- మిర్చి సినిమాలోని బార్బీ గర్ల్ పాట తో నాగ్ గ్రాండ్ ఎంట్రీ. వెంటనే మళ్ళీ అఖిల్ సినిమాలోని అక్కినేని సాంగ్ తో స్టేజ్ పైకి నాగ్ వచ్చి బంగార్రాజు సినిమాలోని పార్టీ సాంగ్ కి డాన్స్ వేశారు.

స్టేజ్ పైకి ఎలిమినేట్ అయిన 14 ఇంటి సభ్యులు వచ్చారు. ముందుగా ఉమాదేవి వరుడు కావలెను సినిమా నుంచి దిగు దిగు నాగ పాటకి డాన్స్ వేశారు. తర్వాత జెస్సీ , పింకి , శ్వేత వర్మ కలిసి బృందావనం సినిమాలో పాటకి డాన్స్ వేశారు. కాజల్ వచ్చి అఖండ లోని జై బాలయ్య పాటకి డాన్స్ వేసింది. ఇదే పాటలో ప్రియ మరియు లహరి వచ్చారు.

తదుపరి విశ్వా వచ్చి పుష్ప సినిమాలోని పాటకి డాన్స్ వేశారు. అదే పాటకి హమిదా కూడా వచ్చి డాన్స్ వేసింది. ఇప్పుడు యాని మాస్టర్ మరియు నటరాజ మాస్టర్ కలిసి ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి డాన్స్ వేశారు. రవి మరియు లోబో డాన్స్ వేయలేదు.

నాగార్జున గారు వచ్చి అందరిని పలకరిస్తున్నారు. ఫుల్ కామెడీ గా ఉంది. ఎక్కువ శాతం కంటేస్టంట్స్ శ్రీరామ్ చంద్ర విన్ అవుతారని చెప్తున్నారు. లోబో కి చిరంజీవి గారి సినిమా లో ఛాన్స్ వచ్చింది చెప్పారు. శ్వేత శ్రీరామ్ విన్ అవుతారని చెప్తున్నారు. జెస్సీ కి మైత్రి మూవీ మేకర్స్ వాలు హీరో గా ఆఫర్ ఇచ్చారు అని చెప్పారు. నటరాజ్ మాస్టర్ కూడా హీరోగా సినిమా చెస్తున్నారు. ప్రియాంక కి మూవీ ఆఫర్స్ వస్తున్నాయి. బ్రేక్.

06:51PM:- నాగ్ గారు కంటేస్టంట్స్ యొక్క పేరెంట్స్ తో మాట్లాడుతున్నారు. ఇపుడు మన టీవీ ఓపెన్ చేశారు. ఓపెన్ అవ్వగానే మానస్ భీమ్ల నాయక్ టైటిల్ సాంగ్ కి డాన్స్ వేశారు. తర్వాత శ్రీరామ్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలోని లవర్ ఫైటర్ పాటకి డాన్స్ వేశారు. తర్వాత సిరి లవ్ స్టొరీ సినిమాలోని సరంగ దనియ పాటకి డాన్స్ వేసింది. ఇప్పుడు షను వచ్చి విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ పాటకి డాన్స్ వేశాడు. చివరికి సన్నీ మాస్టర్ సినిమాలోని పాటకి డాన్స్ వేశారు. సన్నీ తో కలిసి అందరూ డాన్స్ వేశారు.

ఇప్పుడు నాగ్ మన టీవీ నుంచి టాప్ 5 తో మాట్లాడుతున్నారు. ఈ 5 మందికి 13 కోట్ల ఓట్స్ పడ్డాయి. ఇప్పుడు నాగ్ అందరికి 105 డేస్ జర్నీ వీడియో చూపిస్తున్నారు. వీడియో చాలా ఎమోషనల్ గా ఉంది. కొంత మంది కంటేస్టంట్స్ ఏడుస్తున్నారు. నాగ్ ఫైనల్ టాక్ అడిపిస్తున్నారు. టాక్ పేరు హృదయం ఎక్కడ ఉన్నాడు. కంటేస్టంట్స్ వారికి ఇష్టమైన ప్లేస్ లో హార్ట్స్ పెట్టాలి. ఎవిక్షన్ టైం. కంటేస్టంట్స్ వారికి ఇష్టమైన ప్లేస్ లో హార్ట్స్ పెట్టేశారు. ఇప్పుడు ఎలిమినేషన్ టైం. బ్రేక్.

07:30PM :- నాగ్ గారు స్టేజ్ పైకి రాజమౌళి గారిని పిలిచారు. నాగ్ మరియు రాజమౌళి కలిసి ఫుల్ కామెడీ చేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్. గురించి కాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత రాజమౌళి గారు బ్రహ్మస్త్ర సినిమా గురించి చెప్పారు. ఇప్పుడు రాజమౌళి గారు అయాన్ ముఖర్జీ నీ , రణబీర్ కపూర్ మరియు అలియా భట్ నీ స్టేజ్ పైకి పిలిచారు. అందరూ బ్రహ్మాస్త్రం గురించి మాట్లాడుతున్నారు.

ఇప్పుడు నాగ్ మన టీవీ అని చెప్పగా కంటేస్టంట్స్ అందరూ అలియా భట్ మరియు రణబీర్ నీ చూసి షాక్ అయ్యారు. ఇప్పుడు టాప్ 5 తో నాగ్ బ్రహ్మాస్త్రం గేమ్ అడిపించబోతున్నారు. అందరూ బ్రహ్మాస్త్రం చేతిలో పెట్టుకొని వారిలో ఉన్న పవర్ ఎంటో చెప్పాలి. అందరిలో ఎవరిది బాగా రాజమౌళి గారికి నచ్చుతుందో వారికి ఆ బ్రహ్మాస్త్రం ఇస్తారు. ఇప్పుడు అందరివీ విన్నాక రాజమౌళి గారు బ్రహ్మాస్త్రం మానస్ కి ఇచ్చారు. బ్రహ్మాస్త్రం టీమ్ నీ పంపించేశారు బ్రేక్.

07:45 PM :- ఇప్పుడు నాగ్ స్టేజ్ పైకి వచ్చి డింపుల్ హాయతి డాన్స్ పెర్ఫార్మెన్స్ అని చెప్పి వెళ్లిపోయారు. డింపుల్ వచ్చి స్టేజ్ నీ తన హాట్ డాన్స్ తో హీట్ ఎక్కించింది. మరల నాగ్ గారు స్టేజ్ పైకి వచ్చారు. మరల స్టేజ్ పైకి రాజమౌళి గారినీ పిలిచారు.

ఈసారి డిస్నీ హిట్స్ స్టార్ లో విడుదల కాబోతున్న వెబ్ సీరీస్ గురించి. ఇప్పుడు జగపతి బాబు నీ మరియు నవీన్ నీ కూడా స్టేజీ పైకి పిలిచి పరంపర వెబ్ సిరిస్ ట్రైలర్ వేశారు. ఈ సీరీస్ నిర్మించింది బాహుబలి మేకర్స్. జగపతి బాబు గారు పరంపర సీరీస్ గురించి చెప్పారు. నాగ్ పరంపర టీమ్ నీ పంపించేశారు బ్రేక్.

08: 15PM :- ఇప్పుడు నాగ్ పుష్ప టీమ్ నీ పిలవగ స్టేజీ పైకి సుకుమార్ , రష్మీక , దేవిశ్రీ ప్రసాద్ వచ్చారు. టాప్ 5 నీ టాప్ 4 చేసేది పుష్ప టీమ్. ఇప్పుడు నాగ్ రష్మీక మరియు దేవిశ్రీ ప్రసాద్ నీ హౌస్ లోకి పంపిస్తున్నారు. రష్మిక మరియు దేవిశ్రీ హౌస్ లోకి వెళ్లి ముందుగా కంటేస్టంట్స్ నీ 10 క్వెషన్స్ అడిగారు. కంటేస్టంట్స్ ఫుల్ కామెడీ చేస్తున్నారు.

టైం టు ఎలిమినేట్ కంటేస్టంట్. ఇప్పుడు గాల్లో 5 డ్రోన్స్ వస్తాయి ఒకొకరి ఫోటో ఒకో డ్రోన్ పైన ఉంటుంది. ఎవరి డ్రోన్ అయితే గాల్లో వెళ్ళిపోతుంది వారు ఎలిమినేట్. సిరి డ్రోన్ గాల్లో వెళ్ళిపోయింది. కాబ్బటి సిరి ఎలిమినేట్ అయింది. సిరి రష్మీక సామి సామి పాటకి డాన్స్ వేశారు. సిరి నీ హౌస్ నుంచి రష్మీక మరియు దేవిశ్రీ కలిసి స్టేజ్ పైకి తీసుకొని వచ్చారు. పుష్ప టీమ్ నీ నాగ్ పంపించేసి సిరి తో మాట్లాడుతున్నారు. సిరిని ఎక్స్ కంటేస్టంట్స్ దగ్గరికి పంపించేశారు బ్రేక్.

08:33 PM :- ఇప్పుడు నాగ్ మరల స్టేజ్ పైకి వచ్చి సూపర్ 8 సింగర్స్ నీ పిలిపించారు. సూపర్ 8 సింగర్స్ వచ్చి సాంగ్స్ పాడుతున్నారు. అందరూ పాడే సరికి టాప్ లేచిపోయింది. రాహుల్ ఆర్.ఆర్.ఆర్. లోని నాటు నాటు సాంగ్ , భీమ్ల నాయక్ టైటిల్ సాంగ్ ఇంకా చాలా 2021 హిట్ సాంగ్స్ అన్నీ స్టేజ్ పైన పాడేశారు.

09:10 PM :- ఇప్పుడు నాగ్ స్టేజ్ పైకి వచ్చి టాప్ 4 నీ టాప్ 3 చేయడానికి నాని శ్యామ్ సింగరాయ్ సినిమా టీమ్ నీ స్టేజ్ పైకి పిలువగా నాని , సాయి పల్లవి , కృతి శెట్టి వచ్చారు. కాసేపు శ్యామ్ సింగరాయ్ గురించి మాట్లాడి నాని మరియు నాగ్ కలిసి కామెడీ చేశారు.

ముందుగా హౌస్ లోకి సాయి పల్లవి మరియు కృతి శెట్టి నీ పంపించారు. ఏవిక్షన్ గేమ్ అడిపిస్తున్నారు. ఇప్పుడు నాని నీ హౌస్ లోకి పంపిస్తున్నారు. నాని తో పాటు ఒక సూట్ కేస్ కూడా పంపిస్తున్నారు. ఎవరైనా వెళ్ళిపోవలనుకుంటే ఆ సూట్ కేసు తీసుకొని వెళ్లిపోవచ్చు. ఎవరు సూట్ కేస్ తీసుకోలేదు. ఇప్పుడు నాని ఒకరిని ఎలిమినేట్ చేసి బయటికి తీసుకొని రావాలి. ఎవరి టీ.షార్ట్ అయితే పడిపోతుందో వారు ఎలిమినేట్. మానస్ షర్ట్ కింద పడిపోవడం తో మానస్ ఎలిమినేట్ అయ్యాడు. నాని , సాయి పల్లవి మరియు కృతి శెట్టి కలిసి మానస్ నీ హౌస్ నుంచి బయటికి తీసుకొని వచ్చారు. మానస్ స్టేజ్ పైకి వచ్చారు. శ్యామ్ సింగరాయ్ టీమ్ వెళ్ళిపోయారు. స్టేజ్ పైన మానస్ తో కాసేపు నాగ్ మాట్లాడి ఎక్స్. కంటేస్టంట్స్ దగ్గరికి పంపించేశారు బ్రేక్.

09:30 PM :- బ్రేక్ తర్వాత శ్రేయ వచ్చి డాన్స్ వేసింది. తర్వాత నాగార్జున స్టేజ్ పైకి వచ్చి చైతు నీ పిలవగా నాగ చతన్య వచ్చి ప్రో కాబ్బడి గురించి చెప్పి పోస్టర్ మరియు యాడ్ వీడియో చూపించారు. వీడియో అయ్యాక నాగార్జున కోసం స్పెషల్ 105 డేస్ వీడియో చూపించారు. వీడియో చాలా ఎమోషనల్ గా మరియు కామెడీ గా , సీరియస్ గా ఉంది.

నాగార్జున గారు చైతు కోసం ఒక టాస్క్ ఇచ్చారు. టాప్ 3 నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసి తీసుకొని రావాలి. ఇప్పుడు చైతు గోల్డెన్ సూట్ కేస్ తీసుకొని హౌస్ లోకి వెళ్ళారు బ్రేక్.

09:43 PM :- ఇప్పుడు చైతు హౌస్ లోకి వెళ్లి కంటేస్టంట్స్ కి ఎవరికైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అని చెప్పారు. కానీ ఎవరూ పెద్దగా ఆశక్తి చూపించడం లేదు. ఇపుడు ఎలిమినేషన్ రౌండ్ స్టార్ట్ అయ్యింది. స్టేజ్ పైన 3 పాట్స్ ఉన్నాయి. నాగ్ ఆ పాట్స్ లో వాటర్ పోస్తారు. ఎవరి పాట్ నుంచి ఎరుపు రంగు వస్తుందో వారు ఎలిమినేట్. శ్రీరామ్ పాట్ రెడ్ కలర్ లో రావడం తో శ్రీరామ్ ఎలిమినేట్ అయ్యాడు. ఇపుడు నాగ చైతన్య శ్రీరామ్ నీ తీసుకొని స్టేజ్ పైకి తీసుకొని వచ్చారు. నాగ్ చైతు నీ పంపించేసి శ్రీరామ్ తో కాసేపు మాట్లాడి ఎక్స్. కంటేస్టంట్స్ దగ్గరికి పంపించేశారు. ఇప్పుడు టాప్ 2 లో మిగిలింది సన్నీ మరియు షన్ను.

10:05 PM :- ఇప్పుడు నాగ్ మళ్ళీ ఎక్స్ కంటేస్టంట్స్ కి టాస్క్ ఇచ్చారు. ఎవరు విన్నర్ అని. అందరిలో ఎక్కువ శాతం సన్నీ కే ఓటే వేశారు. ఇప్పుడు నాగ్ ఫరియా అబ్దుల్లా కి స్టేజ్ పైకి పిలిచారు. ఫరియా నీ హౌస్ లోకి పంపించారు. సన్నీ మరియు షన్ను తో ఫరియా డాన్స్ వేస్తున్నారు బ్రేక్.

10:20PM:- ఇప్పుడు సన్నీ మరియు షాన్ను స్టోరీ రూం కి వెళ్లి ఎవరి పేరు ఉన్న బాక్స్ వారు తీసుకొని ఫరియా ముందుకు రావాలి. ఇప్పుడు ఆ బాక్స్ లో ఇద్దరు ఒకేసారి చెయ్యి పెట్టాలి. బాక్స్ లో చెయ్యి పెటి బయటికీ తీసాక ఎవరి చెయ్యి రెడ్ కలర్ లో ఉంటుందో వారు ఎలిమినేట్ గ్రీన్ కలర్ ఉన్న వారు బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్. నాగార్జున గారు కౌంట్ డౌన్ మొదలు పెట్టారు. సన్నీ మరియు షన్ను బాక్స్ లో చేయి పెట్టి కలుపుతున్నారు. ఇద్దరి చేతికి బ్లూ కలర్ వచ్చింది. ఫరియా నీ పంపించేశారు.

ఇప్పుడు నాగ్ స్టేజ్ పైన బిగ్ బోస్ ట్రోఫీ చూపిస్తున్నారు. ట్రోఫీ కోసం స్పెషల్ డాన్స్ పెర్ఫార్మెన్స్ జరుగుతుంది. ఇప్పుడు నాగ్ ఏ స్వయంగా హౌస్ లోకి వెళ్తున్నారు బ్రేక్.

10:30PM :- నాగ్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. సన్నీ మరియు షన్ను తో కాసేపు మాట్లాడి హౌస్ నీ ఎంజాయ్ చేస్తున్నారు. నాగ్ హౌస్ అంతా తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. హౌస్ కి గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది. నాగ్ ఇద్దరు చేతులు పట్టుకొని ఫైర్ క్రాకర్స్ మధ్యలో నడుస్తున్నారు. బిగ్ బాస్ వాయిస్ ఓవర్ లో ఇద్దరినీ అభినందిస్తున్నారు. నాగ్ ఇద్దరినీ తీసుకొని హౌస్ నుంచి తీసుకొని స్టేజ్ పైకి వచ్చారు బ్రేక్.

10:45PM :- స్టేజ్ పైన నాగ్ తో పాటు సన్నీ మరియు షన్ను ఉన్నారు. నాగ్ కౌంట్ డౌన్ మొదలు పెట్టారు ఇద్దరి చేతులు పట్టుకొని. మొత్తానికి సస్పెన్స్ పూర్తయి సన్నీ బిగ్ బోస్ సీజన్ 5 విన్నర్ అవ్వగా షన్ను రన్నర్ అప్ గా నిలబడ్డాడు. విన్నర్ సన్నీ కి 50 లక్షల చెక్ , సువర్ణ భూమి ల్యాండ్ , టీవీయస్ అపచీ బైక్ మరియు ట్రోఫీ నాగ్ అందించారు.

రన్నర్ అప్ షన్ను స్పీచ్ ఇచ్చారు. తర్వాత విన్నర్ సన్నీ స్పీచ్ ఇచ్చారు. సన్నీ స్పీచ్ లో అందరిని నవ్వించారు, నాగ్ నీ ఎత్తుకున్నారు. ఫుల్ ఎంజాయ్ చేస్తునాడు. సన్నీ ట్రోఫీ వల అమ్మగారు అయిన కళావతి గారి చేతిలో పెట్టీ దిల్ కూష్ చేసుకున్నారు.

11:00 PM :- ఇప్పుడు నాగ్ కొత్త బిగ్ బాస్ సీజన్ గురించి అనౌన్స్ చేశారు. 2 మంత్స్ గ్యాప్ తో ఇంకో సీజన్ స్టార్ట్ కాబోతుంది అని నాగ్ చెప్పకనే చెప్పారు.

ఇంతటితో బిగ్ బాస్ సీజన్ 5 సమాప్తం.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button