బయో పిక్ చరిత్ర అన్న ప్రేక్షకులు
కథా నాయకుడు పబ్లిక్ టాక్ ఎంటొ తెలుసా ? ?
ప్రపంచ వ్యాప్తంగా నందమూరి తారకరామారావు గారి బయో పిక్ మొదటి పార్ట్ కథానాయకుడు ఈరోజు ప్రీమియర్ షోతో విడుదల అయింది. ఈరోజు బాలయ్య బాబు టీం హైద్రాబాద్ లోని భ్రమారాంబ థియేటర్ లో ఉదయం అయిదు గంటలకు స్పెషల్ షో ద్వారా మొదలైంది. తెలంగాణలో స్పెషల్ షోలకు అనుమతి లేదు గాని ఆంధ్రాలో మాత్రం రోజుకు ఆరు షోలకు అనుమతి లభించింది.
మొట్ట మొదటి ఆన్లైన్ టికెట్ ఒక ఎన్నారై మూడున్నర లక్షలకు కొనుగోలు చేసి ఆ డబ్బును బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి కి విరాళం ఇచ్చారు.
ప్రసాద్ ఐమాక్స్ వద్ద ఉన్న జనం టాక్ ను అనుసరించి ఇదొక అద్భుతమైన సినిమా అని, తెలుగు జాతి చరిత్రలో నిలిచిపోయే సినిమా అని, సాక్షాత్ అన్నగారు నటించారా అన్నట్టు అనిపించింది అని సగటు ప్రేక్షకులు చెప్పిన ఫీడ్ బ్యాక్.మొత్తానికి బాలయ్య బాబు మరోసారి సంక్రాంతి విజేత గా చరిత్ర సృష్టించ బోతున్నాడు అన్నది ఖాయం.చాలా సినీ పోర్టల్ లు ఈ సినిమా కు 3.5/5ఇవ్వడం నిజంగా గ్రేట్.
నాగబాబు చూడాలి ఈ సినిమా అని ప్రేక్షకులు పబ్లిక్ టాక్ లో తెలిపారు.