Boss is back in Complete Mass Avatar : అరాచకం ఆరంభం చేయడానికి సిద్ధం అయినా మాస్ మూలవిరాట్ :-

Boss is back in Complete Mass Avatar : హెడ్డింగ్ చదవగానే మీకు మ్యాటర్ అర్ధం అయ్యిపోయినట్లుంది. అదేనండి మెగాస్టార్ చిరంజీవి గారు చేస్తున్న సినిమాలలో స్ట్రెయిట్ తెలుగు సినిమా బాబీ దర్శకత్వం లో చేసే సినిమానే.
చిరు చేస్తున్న సినిమాలలో గాడ్ ఫాదర్ మలయాళం రీమేక్ , భోళాశంకర్ తమిళం సినిమా రీమేక్. అయితే ఇలా వరుస రీమేక్స్ తో చిరు బిజీ ఉన్నప్పుడు అభిమానులు కోరుకునే విధంగా స్ట్రెయిట్ తెలుగు సినిమా కూడా సైన్ చేసి అభిమానులకు రెట్టింపు ఆనందం ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే అభిమానుల ఆనందం రెట్టింపు అవ్వడానికి కారణం బాబీ తో చేస్తున్న సినిమానే కారణం. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి అధికారిక పూజ కార్యక్రమాలు మరియు అధికారిక పోస్టర్ విడుదల చేశారు.
కాగా విడుదల చేసిన పోస్టర్ తోనే సినిమా మీద హైప్ రేటింపు కాదు అంతకు మించి వచ్చిందని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు. ఎన్నో సంవత్సరాలుగా కంప్లీట్ మాస్ యాంగిల్ లో చిరు ని చూడాలనుకున్న అభిమానుల కల బాబీ దర్శకత్వం లో నెరవేరబోతోంది.
ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలయి వచ్చే సమ్మర్ లో విడుదల చేయాలనీ సన్నాహాలు చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా కి నిర్మాణ బాధ్యతలు స్వీకరించగా దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నారు.
పోస్టర్ తోనే ఊర మాస్ చిరు ని చూపించిన చిత్రబృందం మొత్తం సినిమాని ఇంకా ఏ రేంజ్ లో చేయబోతున్నారో అని అభిమానులు ఇప్పటినుంచే ఊహలో మునిగితేలుతున్నారు.