Tollywood news in telugu
అభిమానుల మీద చేయి చేసుకున్న బౌన్సర్ లు
జనసేన కార్యకర్తలపైన దాడి చేసిన పవన్ బౌన్సర్లు.
నిన్నే క్రిస్మస్ వేడుకలకై యూరప్ ట్రిప్ కు వెళ్ళి ఫ్యామిలీ తో విజయవాడ తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్ నూతన సంవత్సర వేడుకల కోసం విజయవాడ పార్టీ కార్యలయానికి వచ్చి నూతన సంవత్సర వేడుకలలో పాల్గొన్నారు. అయితే అభిమానులు కార్యకర్తలు పవన్ మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారి గా స్టేజి మీదకు రావడానికి ప్రయత్నం చేశారు. దీంతో తోపులాట జరిగింది.
దీంతో పవన్ పర్సనల్ బాడీగార్డ్ లు అభిమానులను కార్యకర్తలను దూరంగా నెట్టివేశారు. కొన్ని కథనాల్లో కార్యకర్తల మీద వారు పిడి గుద్దులు గుద్దారు, దీంతో నెలకొన్న ఉద్రిక్తత వల్ల పవన్ మాట్లాడకుండానే వెను దిరిగాడు. ఇక్కడ నుండే పార్టీ కార్యకలాపాలతో సహా పూర్తి స్థాయి కార్యచరణ మొదలు పెడదామనుకునే సమయంలో ఇలా జరగడం దాని మీద పవన్ స్పందన లేకపోవడం వల్ల అభిమానులు నూతన సంవత్సరము వేళ నిరాశ పడ్డారు.