Viral news in telugu
BUFFALO ATTACK: దున్నలు ఒక్క సారిగా దాడిచేస్తే ఎలాఉంటదో .. చుడండి…!

BUFFALO ATTACK: మనుషులపై, పెంపుడు జంతువులపై అడవి పందులు దాడిచేయడం విన్నాం, కానీ ఇక్కడ అదే అడవి పంది పై బర్రెలు,దున్నలు దాడిచేయడం విన్నారా… అవును ఇది నిజం ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. అక్కడ దాదాపు ఇరవై బర్రెలు ఏకమై ఒక అడవి పందిని మట్టికలిపించాయి.
మాములుగా మనుషుల మధ్య మెదిలే పెంపుడు జంతువులు ఎలాంటి దాడికి దిగవు, కానీ ఇక్కడ బర్రెలు ఒక్కసారిగా కలిసి కట్టుగా దాడికి దిగి అక్కడికి వచ్చి పంటను నాశనం చేస్తున్న అడవి పందిని చంపేశాయి. ఇది ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం బండల్ నాగాపూర్ గ్రామ సమీపంలో ఈ వింత కనపడింది.
సాధారణంగా అడ్డువచ్చిన వారి పై దాడిచేసే అడవి పంది.. బర్ల చేతిలో ఓడిపోవడం అక్కడున్నవారిని ఆశ్చర్యానికి గురిచేసింది.