Bunny Vs Chiru : చిరు తో పోటీ పడనున్న బన్నీ:-
Bunny Vs Chiru : మెగా ఫామిలీ లో చిరు తర్వాత డాన్సులో ప్రజలని తనదైన మార్క్ నటనతో మరియు డాన్స్ లతో ప్రజలచేత స్టైలిష్ స్టార్ గా, ఐకానిక్ స్టార్ గా ముద్ర తెచ్చుకున్నాడు.
అయితే చిరంజీవి చాల గ్యాప్ తీసుకొని మళ్ళి సినిమాలు చేస్తూ అభిమానులకి పూర్వ వైభోగం కల్పిస్తున్నాడు. ఇదిలా ఉండగా చిరు, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమాకి సరైన రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేకపోతున్నారు చిత్ర బృందం. కొరటాల శివ దర్శకత్వం వహించారు.
అయితే సంక్రాంతి బరిలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ భీమా నయక్ రావడం తో ఆచార్య సంక్రాంతి పోటీలో దిగడం మానేసి కొత్త విడుదల తేదీ కోసం వెతకగా చివరికి డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా బరిలో దింపాలని సన్నాహాలు చేస్తున్నారు.
అయితే అదే సమయంలో అల్లుఅర్జున్ పుష్ప పార్ట్ 1 ది రైజ్ వస్తుందని చిత్ర బృందం ఎపుడో చెప్పేశారు. ఇపుడు ఆచార్య సినిమాకి ఎటు పోనీ పరిస్థితి. ఇప్పటికే చాల సార్లు పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు కాబట్టి క్రిస్మస్ కి ఎలా అయినా విడుదల అవ్వాల్సిందే.
చూడాలి మరి అల్లు అర్జున్ , చిరంజీవి నిర్ణయాన్ని ఏ విధంగా స్వీకరించబోతున్నారో. చిరు మరియు బన్నీ సినిమాలు ఒకేసారి బరిలో మొదటి సారి దిగబోతున్నాయి. చూడాలి మరి ఈసారి ఎం జరగబోతుందో మరి.