telugu facts

business ideas in telugu

business ideas in telugu

Business ideas in telugu – తక్కువ పెట్టు బడితో ఎక్కువ లాభాలు వచ్చే కొన్ని వ్యాపారాలు ఇక్కడ చూద్దాం అందులో కొన్ని , ఇవి నా ఆలోచనలతో అనుభవాలతో చెబుతున్నవే ఇవి ఒక ఆప్షన్ లాగ చూసి మీకు నచ్చితే ట్రై చేయండి.

ఆన్లైన్ ట్యూషన్స్
మీకు అందుబాటులో ఉన్న కొన్ని ఆన్లైన్ పోర్టల్ లో కొంత డబ్బులు కట్టి ఎప్పుడు బిజీ గా ఉండొచ్చు, ఇందుకు గాను మీరు సోషల్ మీడియాని యూజ్ చేసుకోవచ్చు లేదా క్వికర్ లాంటి ఆన్లైన్ పోర్టల్ లో ఫ్రీ గా పోస్ట్స్ చేసి స్టూడెంట్స్ ని పొందవచ్చు.

బ్లాగింగ్
మీకు తెలిసిన టాపిక్ , బాగా వచ్చిన టాపిక్స్ బ్లాగింగ్ చేస్తూ మీరు డబ్బు సంపాదించవచ్చు , దీనికి డబ్బు పెట్టాల్సిన పనికూడా లేదు, ఫేస్బుక్ లో కొన్ని పోస్ట్ లు షేర్ చేసి చేసి కొంచెం ట్రాఫిక్ వచ్చాక మీరు గూగుల్ యాడ్స్ కి అప్లై చేసుకుంటే ఈజీ గా అప్రూవల్ అవుతుంది దీనికి కావాల్సింది జెన్యూన్ గా కంటెంట్ రాయటమే ఇంకా వేరే బ్లాగ్స్ కంటెంట్ కాపీ చేయకుండా మీకు తెలిసిన వొకాబులరీ తో రాయటమే. ఇలా బ్లాగింగ్ ని కెరీర్ గా చేసుకొని చాల మంది సెటిల్ అయ్యారు కూడా.

టిఫిన్ కారియర్ బిజినెస్
ఈ బిజీ లైఫ్ లో ఎవరికీ వంట చేసుకునే తీరిక లేకుండా పోయింది , మంచి రుచి కరమైన వంటలు చేయటమే చేపించగలగటమో తెలిస్తే మధ్యాహ్నం భోజనం కి టిఫిన్ కెరీర్ ఇచ్చే బిజినెస్ చేస్తే క్లిక్ గాని అవుతే మంచి లాభాలు పొందవచ్చు.

యూట్యూబ్ వీడియోస్
మీకు తెలిసిన సబ్జెక్టు ని అర్ధం అయ్యేలా చెప్పగలిగితే , మీకు వచ్చిన కల ని ఉదాహరణకి ట్రావెలింగ్ .., సినిమా న్యూస్ , సినిమా రివ్యూస్ , ప్రాంతాలు విశేషాలు , డివోషనల్ ఇలా ఏమైనా కావచ్చు జెన్యూన్ గా చెప్పగలిగితే సక్సెస్ ఈజీ గా అవచ్చు సబ్స్క్రైబర్స్ ని పొంద వచ్చు.

రెంటల్ బిజినెస్
ఈ బిజీ లైఫ్ లో రెంటెడ్ హౌసెస్ చూసుకునే టైం కూడా లేకుండా పోయింది , తీరిక సమయం లో ఇల్లు చూసి మీరు చిన్న గా ఆఫీస్ తెరిస్తే సరిపోతుంది ఇందులో ఇల్లు కావాల్సిన వాళ్ళ నెంబర్ మరియు అడ్వాన్స్ తీసుకొని ఇల్లు దొరికాక ఒక మంత్ రెంట్ ఎంతో అంత వారికి ఛార్జ్ చేస్తున్నారు , డిమాండ్ ఉంది కాబట్టి ఇచ్చే వాళ్ళు ఎక్కువే ఉన్నారు.

ఎస్ ఈ ఓ
ఎస్ ఈ ఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజషన్ , ఈ కోర్స్ యూటుబ్స్ లో దొరుకుతుంది , దీనికి చాలా డిమాండ్ ఉంది ఎందుకంటే చాల మంది వెబ్సైట్ రన్ చేస్తున్నారు వాళ్ళకి ప్రమోషన్ చేసుకునే తీరిక ఉండదు ఇందుకు గాను మీరు వాళ్ళ సైట్ ని ప్రమోట్ చేయటం వల్ల మీరు ఇంటినుండి డబ్బులు సంపాదించవచ్చు , దీనికి కంప్యూటర్ ఇంకా ఇంటర్నెట్ ఉంటె సరిపోతుంది.

ఆన్లైన్ బర్త్డే కేక్ బిజినెస్
బర్త్డే రోజున కేక్ కట్ కట్ చేయటం సాధారణం , ఎవరికైనా అవసరమే కొందరికి ముఖ్యం గా ఆఫీస్ పనులకి పోయే వారికి అసలు తీరిక ఉండదు దీనికి ఒక వెబ్సైటు తాయారు చేపించి అందులో ఆర్డర్స్ పొందటం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు.

కంటెంట్ రైటర్

కంటెంట్ రైటర్ జాబ్స్ కి విపరీతమైన డిమాండ్ ఉంది , మీకు ఏ లాంగ్వేజ్ వచ్చిన ఆ లాంగ్వేజ్ పైన జాబ్స్ ఉన్నాయి కానీ దీనికి కావాల్సింది మీ స్టైల్ లో మీరు గా అందరికి నచ్చేలా రాయటమే, ఒకేసారి ఒకటి నుండి పది వెబ్సైటు లకి ఫ్రీలాన్స్ గా చేసుకోవచ్చు.

Tags

2 Comments

  1. Hi tell me sir one excellent business idea with less investment that can be operated in Hyderabad.and give me your contact I will contact you .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button