డయాబెటిస్ ఉన్న వారు మామిడి పండు తినవచ్చా?
can diabetics consume mangoes
పళ్ళలో రాజు వంటి ఫలం మామిడి పండు. అటువంటి ఈ పండు వేసవిలో మాత్రమే మనకు లభ్యం అవుతుంది. ఎండ వేడిమి కంటే ఈ మామిడి కోసం చాలా మంది వేసవి కోసం ఎదురు చూస్తుంటారు. దీనిలో విటమిన్ A, విటమిన్ B6, విటమిన్ E, విటమిన్ K ఇంకా చాలా చాలా పోషకాలు ఉన్నాయి. అయితే దీనిలోని అధిక చక్కెర శాతం, కేలోరీలు – డయాబెటిస్ ఉన్న వారిని హడలెత్తిస్తాయి. చాలా మందికి ఈ పండు తినాలా వద్దా అనే సందేహం కలుగుతుంది. మరి తెలుసుకోవాలంటే చదవండి మరి.
ఒక diabetologist ప్రకారం డయాబెటిస్ ఉన్న వారు రోజుకు సగం మామిడి పండు తినవచ్చు. అందులోనూ జ్యూస్ ను మినహాయించి పండు మాత్రమే తినాలి. ఇంకా మామిడి పండు తిన్న గంటకు మాత్రమే ఆహారం భుజించాలి అంటున్నారు ఎస్ఎల్ రహేజ హాస్పిటల్ కు చెందిన అనిల్ భోరాస్కర్.
అన్నిటి కంటే ముఖ్యంగా మామిడి పండు తిన్నాక వెంటనే గ్లుకోమీటర్ తో blood sugar చూసుకోవాలి. అది అదివరకటి కంటే 25% ఎక్కువగా ఉంటే అటువంటి వారు మామిడి పండు తినకపోవడం మంచిది. ఇలా ఎందుకంటే ఒక్కో పండు, ఒక్కో వ్యక్తికి ఒక్కో విధమైన రీతిలో పని చేస్తుంది. అందువల్ల కొందరికి డయాబెటిస్ ఉన్నా మామిడి పండు తింటే ఏమీ కాదు, మరి కొందరికి బ్లడ్ షుగర్ అమాంతం పెరిగిపోతుంది. ఈ తేడాను గమనించవలసినది అంటున్నారు వైద్యులు.
మొత్తానికి మామిడి పండు తినాలా వద్దా అంటే, blood sugar పెరగనప్పుడు మామిడి పండు తప్పకుండా తినాల్సిన ఫలం. దీనిలో ఉండే పీచు పదార్ధం శరీరానికి మేలి చేయడమే కాక మెదడు పని తీరును కూడా మెరుగు పరుస్తుంది.