chaavu kaburu challaga review: ‘చావు కబురు చల్లగా’ మూవీ రివ్యూ

చిత్రం పేరు : చావు కబురు చల్లగా
తారాగణం : లావణ్య త్రిపాఠి, కార్తికేయ గుమ్మకొండ, ఆమని, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగర్, రజిత, భద్ర, ప్రభు తదితరులు
నిర్మాతలు: బన్నీ వాసు
డైరెక్టర్ : కౌశిక్ పెగళ్లపాటి
సమర్పణ: అల్లు అరవింద్
ఈ సినిమా 2020 లో విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగా ఇప్పటికి రిలీజ్ అయింది. ఇక మొదటి “మై నేం ఈజ్ రాజు” అనే పాట తో సినిమావైపు ద్రుష్టి మరల్చుకుంది.
కథ విషయానికి వస్తే…
chaavu kaburu challaga review “చావు కబురు చల్లగా” బస్తీ బాలరాజు (కార్తికేయ) శవాలను తీసుకుపోయే బండి నడుపుతూ జీవనం గడుపుతాడు. మల్లిక (లావణ్య) రోజూ పుట్టిన పిల్లల్నిచూసుకొనే మెటర్నిటీ వార్డులో నర్సు గా పనిచేస్తుంది. ఇక ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తన భర్త శవం దగ్గర కూర్చుని ఏడుస్తున్న మల్లిక (లావణ్య) ని చూసి, జాలితో ప్రేమలో పడతాడు బాలరాజు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ తప్ప మరో కారణం ఏమీ లేదు. తనకోసం వెంటపడుతూ ఉంటాడు.
హీరో బాలరాజు తల్లి గంగమ్మ (ఆమని) ఆమె భర్త ఆరోగ్యం సరిగా లేక మంచాన పడే ఉంటాడు. గంగమ్మ మొక్కజొన్న కంకులు అమ్ముకుని జీవనం కొసాగిస్తుంది. భర్త ను కోల్పోయిన మల్లిక, భర్త మంచమ్మీద పడ్డ గంగమ్మల జీవితాలు ఎలాంటి మలుపు తిరుగుతాయి అనేది కథ .
ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే…
ఈ మూవీలో ముందుగా మాట్లాడుకోవాల్సినది కార్తికేయ రోల్ గురించి. ఇతడు ఒక బస్తీ కుర్రాడిగా చాల బాగా నటించాడు. పూర్తిగా క్యారెక్టర్లో లీనమై బస్తి లుక్స్ తో అదరగొట్టాడు. అలాగే ముందు సినిమాలతో పోలిస్తే ఈ చిత్రంలో అతని నటన మరింత మెరుగుపడిన విషయం అందరికి అర్థమౌతుంది. ఇంకా చెప్పాలంటే అతని డైలాగ్ డెలివరీ, మురళీ శర్మ తో కామెడీ టైమింగ్ కానీ ఎమోషన్స్ వీటితో పాటు క్లైమాక్స్ లో కనబరిచిన నటనలతో ఈ సినిమాకు వెన్నె తెచ్చాడు.
ఇక లావణ్య పాత్ర విషయానికి వస్తే… కార్తికేయ లానే తనకి కూడా ఇది ఇంతకు ముందు ఎప్పుడు చెయ్యని డీ గ్లామ్ రోల్ లో చాల బాగా నటించింది. అయితే తన నటనతో తన పాత్రకి అందం తీసుకొచ్చింది. చాలా సింపుల్ లుక్స్ తో కనిపించడం వలన ఆమె నటనలో కూడా మరింత సహజత్వం కనిపిస్తుంది. ఎమోషన్స్, తన బాడీ లాంగ్వేజ్ మరియు కొన్ని కీలక సన్నివేశాల్లో నటనతో ఇరగదీసింది.
చాల కలం తరువాత టాలీవుడ్ లో తెలుగు ప్రేక్షకుల ముందుకు ఒక మంచి రోల్ తో వచ్చారు ఆమనీ గారు. కార్తికేయ తల్లిగా తనకు తగ్గ పాత్రను ఎంచుకొని నీట్ అండ్ క్లీన్ పెర్ఫామెన్స్ ను కనబరిచారు. అలాగే మురళీ శర్మ కూడా తన రోల్ కు న్యాయం చేసారు. మిగిలి రోల్స్ లో చేసిన వారు భద్రం, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు వారి పాత్రలకు న్యాయం చేసారు. అయితే ఈ చిత్రంలో హీరో మరియు అతని తల్లి మధ్య వచ్చే కొన్ని సీన్స్ మంచి ఎమోషనల్ గా ఉండటమే కాకుండా ఇంటర్వెల్ బ్లాక్ మరియు క్లైమాక్స్ లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
సినిమా యొక్క మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే…
బోర్ కొట్టించే సీన్స్ చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే మెయిన్ లీడ్ నడుమ కెమిస్ట్రీ జెనరేట్ చేసేందుకు ప్రయత్నిస్తే బాగుండు అనిపిస్తుంది. వీటితో పాటుగా మరో మైనస్ ఏమిటంటే లావణ్య రోల్ ను ఒక సింపుల్ అండ్ సీరియస్ రోల్ లో కనిపించేలా చేయడం అనేది ఒక మైనస్ అని చెప్పవచ్చు.
ఇక చివరగా చెప్పేది ఏంటంటే..
ఈ “చావు కబురు చల్లగా” లోని కనిపించే కథ కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే కార్తికేయ సాలిడ్ పెర్ఫామెన్స్ లావణ్య త్రిపాఠి రోల్ బాగానే ఉంటుంది. అలాగే మూవీలో ఎమోషన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కొన్ని రొటీన్ సన్నివేశాలు కాస్త బోర్ ఫీలయ్యేలా చేస్తాయి. సినిమా చూడటానికి వెళ్లేవారు బారి అంచనాలతో వెళ్లకుండా ఉండటమే ఉత్తమం. ఒక సారి చూడొచ్చు.